22న టౌన్‌బ్యాంక్ పాలకవర్గ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ
మదనపల్లె : వందేళ్ల ఘనచరిత్ర కలిగిన ది మదనపల్లె కో–ఆపరేటివ్ టౌన్‌బ్యాంక్ పాలకవర్గ ఎన్నికకు ముహుర్తం ఖరారైంది. సోమవారం ఎన్నికల అధికారి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి.దుర్గమ్మ టౌన్ బ్యాంక్ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. నవంబర్ 22న నామినేషన్ల స్వీకరణ, 23న స్క్రూటినీ, 24న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. అదేరోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. టౌన్‌బ్యాంక్ పాలకవర్గానికి ఎన్నిక అనివార్యమైతే, నవంబర్ 29న పట్టణంలోని సొసైటీకాలనీ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్‌లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. నవంబర్ 30న ఆఫీస్ బేరర్ల ఎంపికతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందన్నారు. టౌన్ బ్యాంక్ ఎన్నికలకు సంబంధించి సమగ్ర ఓటరు జాబితాను నోటీసుబోర్డులో ప్రదర్శించామని, సభ్యులు జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలన్నారు. సభ్యులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు బ్యాంకు జారీ చేసిన ఐడీ కార్డులు తప్పనిసరి అన్నారు. ఐడీ కార్డుల కోసం సభ్యులు రెండు ఫొటోలు, బ్యాంక్ పాసుపుస్తకం తీసుకువచ్చి ఐడీ కార్డులు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో టౌన్‌బ్యాంక్ సీఈఓ పెరవలి ప్రసాద్, కోఆపరేటివ్ అధికారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకటించిన
ఎన్నికల అధికారి దుర్గమ్మ
29న పోలింగ్, 30న ఆఫీస్ బేరర్స్ ఎంపిక
ఓటు వేసేందుకు ఐడీ కార్డు తప్పనిసరి
Comments
Please login to add a commentAdd a comment