పంటకోత ప్రయోగాల పరిశీలన
గాలివీడు: మండలంలోని నూలివీడు గ్రామంలో వరి పంట కోత ప్రయోగాలను జిల్లా వ్యవసాయ అధికారి చంద్ర నాయక్ పరిశీలించారు. శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి దిగుబడిని లెక్కించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోత ప్రయోగాలు సర్వే నంబర్ వివరాలను క్షేత్రస్థాయిలో నమోదు చేస్తామన్నారు. ఎరువులు,పురుగు మందులు, ఆశించిన తెగుళ్లు, విత్తనాల సేకరణ తదితర అంశాలను కూడా నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వెంకటరమణ రెడ్డి,జేడీఏ కార్యాలయం టెక్నికల్ ఏఓ రమేష్ రాజు,సిబ్బంది మణి, రాణా ప్రతాప్,తదితరులు పాల్గొన్నారు.
నేడు సర్వసభ్య సమావేశం
కడప ఎడ్యుకేషన్: ది కడప ఎలిమెంటరీ, సెకండరీ స్కూల్ టీచర్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 24న ఉదయం 9 గంటలకు కడప నగర సమీపంలోని పబ్బాపురం ఆఫీస్‌లో జరగనుంది. ఈ విషయాన్ని అధ్యక్ష, కార్యదర్సులు విశ్వనాథరెడ్డి, బాల శౌరిరెడ్డి శనివారం తెలిపారు. జిల్లాలోని సొసైటీ సభ్యులందరూ సమామావేశానికి హాజరుకావాలని కోరారు.
విరాళం అందజేత
బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిద మాంబల నిత్య కల్యాణం కోసం శనివారం హైదరాబాదులోని దూల్‌పల్లెకు చెందిన భక్తులు మాణిక్యరాము,సరిత దంపతులు రూ 1,00116 నగదు ఇచ్చారు. దేవస్థానం మేనేజర్ ఈశ్వరాచారి తరపున సిబ్బంది నగదుకు సంబందించి రశీదు భక్తులకు అందించారు. పిట్‌పర్సన్ శంకర్‌బాలాజీ మాట్లాడుతూ బి.మఠం అభివృద్ధికి భక్తుల సహకారం ఉండాలన్నారు.
26న జీవశాస్త్ర
ఉపాధ్యాయులకు శిక్షణ
కడప ఎడ్యుకేషన్: ఆధునిక కాలానికి అనుగుణంగా విద్యార్థుల్లో శాసీ్త్రయ జిజ్ఞాసను పెంపొందించడానికి జీవశాస్త్ర ఉపాధ్యాయులకు 26వ తేదీ హ్యాండ్స్ అన్ ఎక్స్‌పరిమెంట్స్‌పై ఒక్కరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఈఓ మీనాక్షి తెలిపారు. కడపలోని పురుషుల కళాశాల జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. కడప, అట్లూరు, బద్వేల్, సీకేదిన్నె, చెన్నూరు. గోపవరం, కమలాపురం, ఖాజీపేట, సిద్దవటం, వల్లూరు, ఒంటిమిట్ట మండలాల్లోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో పనిచేస్తున్న జీవశాస్త్ర ఉపాధ్యాయులు హాజరు కావాలని,నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని డీఈఓ తెలిపారు.
30లోపు మ్యాపింగ్
పూర్తి చేయాలి
వీరబల్ల్లి: మండలంలోని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈనెల 30లోపు పూర్తి చేయాలని జిల్లా పంచాయ తీ అధికారి బాలకృష్ణారెడ్డి తెలిపారు. శనివారం ఆయన మండలంలోని మట్లి, వీరబల్లి పంచాయతీలలో గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌పై ఆరా తీశారు. ఆన్‌లైన్‌లో పరిశీలించగా వందశాతానికిగాను 10 శాతమే పూర్తయినట్లు వారు తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు వంద తగ్గకుండా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయా లని వారు సిబ్బందికి సూచించారు. ఈఓపీఆర్‌డీ రామచంద్రారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment