అన్నం.. ఇంత అధ్వానమా!
కలకడ: ఆంధ్రప్రదేశ్ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు వడ్డించే అన్నాన్ని ఇంత అధ్వానంగా చేస్తారా అంటూ కలెక్టర్ ఛామకూరి.శ్రీధర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థినులతో కలిసి ఆయన భోంచేశారు. ముద్దగా ఉన్న అన్నాన్ని చూసి నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మండలంలో పర్యటించారు. తొలుత స్థానిక వెలుగు కార్యాలయంలో మండలస్థాయి అధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించడానికి చొరవ చూపాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కలకడ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని.. ఇదివరకే ఇల్లు ఉండి నిర్మాణం పనులు ఆలస్యం చేస్తే ఇంటి పట్టా రద్దు చేసి అర్హత కలిగిన వారికి మంజూరు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సిమెంట్, కడ్డీలు లబ్ధిదారులకు సకాలంలో అందించాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు.
● కలకడ మాదిగపల్లెలోని అంగన్‌వాడీ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న విద్య, మెనూ తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏపీ బాలికల గురుకుల పాఠశాల (గరడప్పగారిపల్లె)ను తనిఖీ చేశారు. కనీస వసతులు లేకపోవడంతో పాటు... భోజన రుచిలో నాణ్యత లేకపోవడంతో మండిపడ్డారు. రుచితో పాటు శుచి తప్పనిసరని నిర్వాహకులకు సూచించారు. ఆర్‌ఓ ప్లాంట్ నీరు అందకపోవడం, ఆటస్థలం, శాశ్వత భవనం లేకపోవడంపై స్పందించిన కలెక్టర్ పక్కా భవననిర్మాణం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థినులకు కార్పెట్స్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఎంఈఓ మునీంద్రనాయక్‌ను ఆదేశించారు. అలాగే స్థానికుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా డ్వామపడి, ఐసీడీఎస్ పీడీ, తహసీల్దార్ పనికుమార్, ఎంపీడీఓ అబ్దుల్‌రహిమ్, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలకు అందుబాటులో పంచాయతీల డేటా
గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై కలెక్టర్ శ్రీధర్ అసంతృప్తి
విద్యార్థుల వసతుల కల్పనకు కృషి చేయాలని అధికారులకు ఆదేశం
మండల అధికారులతో సమీక్ష
రాయచోటి: గ్రామ పంచాయతీల పన్ను, పన్నేతర డేటాకు వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసినట్లుగా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ తెలిపారు. శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పోర్టల్ ద్వారా పంచాయతీల డేటా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతనంగా ఏర్పాటు చేసిన వెబ్ అప్లికేషన్ ద్వారా పంచాయతీల పన్ను, పన్నేతర అసెస్‌మెంట్‌ల డేటాను పొందుపరిచే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈనెల 30వ తేదిలోపు వందశాతం డేటా ఎంట్రీ జరిగేలా చూడాలని పంచాయతీ కార్యదర్శులకు సూచనలు జారీ చేశామని అందులో పేర్కొన్నారు.
అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించాలి
అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించాలని కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫిరెన్సు హాల్‌లో పల్లె పండుగ పనులు, అంగన్ వాడీ కేంద్రాలలో మరుగుదొడ్లు, నీటి వసతి తదితర అంశాలపై ఆయా అధికారులతో వీడియో కాన్ఫిరెన్సు ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment