తంబళ్లపల్లె: మండల కేంద్రానికి సమీపంలోని మల్లయ్యకొండపై వెలసిన శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి ఆలయాన్ని శనివారం జిల్లా అటవీశాఖ అధికారి జగన్నాథ్‌సింగ్ సందర్శించారు. ఆలయ పూజారి ఈశ్వరప్ప స్వాగతం పలికి స్వామికి ప్రత్యేక అలంకరణతో పూజలు,అభిషేకాలు చేసి దర్శనం కల్పించారు. అనంతరం ఆయన అభివృద్ధి పనులకు ఎంపిక చేసిన స్థలాలను పరిశీలించారు. గౌరవమ్మ ఆలయం వద్ద వ్యూ పాయింట్ (వాచ్‌టవర్) స్థలాన్ని పరిశీలించారు. నీటి సౌకర్యం కోసం పైప్‌లైన్ ఏర్పాటుకు ఎఫ్‌ఆర్‌ఓ ప్రసాదరావుతో చర్చించారు. ఆయన వెంట ఎఫ్‌ఎస్‌ఓ రెడ్డివరప్రసాద్, ఎఫ్‌బీఓ రామరాజు, కొండ కిట్ట తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment