ఏఐటీఎస్‌కు న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్
రాజంపేట: ఏఐటీఎస్ (అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల)కు న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ గౌరవం దక్కింది. ఈ మేరకు శనివారం ప్రిన్సిపాల్ డా. నారాయణ ఇక్కడి విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. నేషనల్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (ఎన్‌ఏసీ) ఏప్లస్ గ్రేడ్ కింద ఏఐటీఎస్‌ను గుర్తించారన్నారు. ఈ విజయం సాధించడానికి తోడ్పాటును అందించిన డీన్ ఆఫ్ అకడమిక్స్ డాక్టర్ మల్లికార్జునరావు, ఐక్యుఏపీసెల్ కో–ఆర్టినేటర్ కె.అజయ్‌కుమార్‌రెడ్డి, అధ్యాపకులు, అధ్యాతకేతర సిబ్బందికి కృతజ్ఞతలను తెలిపారు. ఏఐటీఎస్‌కు న్యాక్ ఏప్లస్ గ్రేడ్ రావడంపై అన్నమాచార్య యూనవర్సిటీ అధినేత చొప్పా గంగిరెడ్డి, ఈడీ చొప్పా అభిషేక్‌రెడ్డి, వైస్‌చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డిలు హర్షం వ్యక్తంచేశారు.
ఆర్ట్ క్యాంపు మెంటార్‌గా కోట మృత్యుంజయ రావు
వైవీయూ: ముంబైలోని కోకుయో క్యామ్లిన్ ఆర్ట్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న దక్షిణ భారతదేశ పెయింటింగ్ క్యాంపునకు రెండు తెలుగు రాష్ట్రాల తరఫున మెంటార్‌గా వైవీయూ లలిత కళా విభాగాధిపతి డాక్టర్ మృత్యుంజయరావు ఎంపికయ్యారు.ఈ మేరకు కామ్లిన్ ఫౌండేషన్ నుంచి ఆయనకు ఉత్తర్వులు అందాయి. ఈ నెల 25 నుంచి 30 తేదీ వరకు కర్ణాటక రాష్ట్రం హంపిలో ఉన్న హంపి యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈ క్యాంపు నిర్వహించనున్నారు. దక్షిణ భారత దేశంలోని అన్ని ఫైన్ ఆర్ట్స్ కాలేజీల నుంచి ఎంపిక చేయబడిన దాదాపు 80 మంది యువ చిత్రకారులు పాల్గొంటున్నారు. కాగా వైవీయూ లలిత కళా విభాగంకు చెందిన బీఎఫ్‌ఏ 4వ సంవత్సరం విద్యార్థి డి. ముత్యం ఈ వర్క్‌షాప్‌నకు ఎంపికయ్యాడు. 80 మంది చిత్రించిన చిత్రాలను ముంబై జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శన చేస్తారు. అమ్ముడుపోయి న చిత్రాల నగదును ఆయా యువ చిత్రకారులకు క్యామ్లిన్ ఫౌండేషన్ వారు అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment