11వ బెటాలియన్‌లో ఓబన్న జయంతి
సిద్దవటం : స్థానిక భాకరాపేట సమీపంలోని ఏపీఎస్పీ 11వ బెటాలియన్‌లో శనివారం వడ్డే ఓబన్న జయంతి నిర్వహించారు. బెటాలియన్ ఇన్‌ఛార్జి కమాండెంట్ నాగేశ్వరప్ప ఓబన్న చిత్ర పటానికి పూలమాలు వేసి గౌరవ వందనం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ ఓబన్న పోరాటం, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరు, స్వాతంత్య్రం కోసం వారు ప్రాణాలర్పించడం మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ పీఎన్‌డీ.ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
రేషన్‌షాపు రాత పరీక్ష ఫలితాల విడుదల
మదనపల్లె : మదనపల్లె రెవెన్యూ సబ్‌డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో రేషన్‌షాపు ఖాళీలకు నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను శనివారం సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ విడుదల చేశారు. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల వివరాలను కార్యాలయ నోటీసు బోర్డులో ప్రదర్శించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ...మదనపల్లె రెవెన్యూ సబ్‌డివిజన్‌లో 119 రేషన్‌షాపు ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానించామన్నారు. వాటిలో హైకోర్టు కేసుల కారణంగా 15 షాపులు, ఒక దరఖాస్తు అందని షాపులు 23 పోగా, మిగిలిన 81 షాపులకు సంబంధించి 709 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిలో స్క్రూటినీ అనంతరం డిసెంబర్ 31న బీటీ కళాశాలలో 367 మంది రాత పరీక్షకు అర్హత సాధించగా, 25 మంది పరీక్షకు గైర్హాజరయ్యారన్నారు. పరీక్ష రాసిన వారిలో 328 మంది పాసు మార్కులు సాధించగా, 8 మంది ఫెయిలయ్యారన్నారు. పరీక్ష తర్వాత ఆరుగురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారన్నారు. దీంతో మొత్తం 251 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment