కాలువలో జారిపడి బాలుడి గల్లంతు
రాజుపాళెం : అభం శుభం తెలియని ముగ్గురు పిల్లలు ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి అందులో ఒక బాలుడు గల్లంతైన సంఘటన రాజుపాళెం మండలంలోని పగిడాల గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని పగిడాల గ్రామానికి చెందిన పందిటి వెంకటయ్యకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. వెంకటయ్య కుమారుడితో పాటు అతని అన్న కుమారులు, జస్వంత్ కలిసి ఆడుకుంటూ ఇంటి సమీపంలోని కేసీ చాపాడు కాలువలో జారి పడ్డారు. నీటిలో కొట్టుకు పోతున్న జస్వంత్ (9) ను కాపాడేందుకు మిగతా ఇద్దరు పిల్లలు శాయశక్తులా ప్రయత్నించినా దొరకలేదు. వెంటనే ఈ సమాచారాన్ని తల్లిదండ్రులకు, గ్రామస్తులకు తెలియజేశారు. వారితో పాటు పోలీసులు, ప్రొద్దుటూరు ఫైర్ స్టేషన్ అధికారులు తమ సిబ్బందితో కాలువలో గాలించారు. అయినా బాలుడి ఆచూకీ కనిపించలేదు. కాలువలో గల్లంతైన బాలుడు జస్వంత్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నాడు. దీంతో గ్రామలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment