నవీన్‌బాబుకు ఉత్తమ ప్రతిభా పురస్కారం
కడప కోటిరెడ్డి సర్కిల్ : బ్రహ్మంగారిమఠం మండలం తోట్లపల్లి గ్రామానికి చెందిన రైల్వే తపాలా ఉద్యోగి జి.నవీన్ బాబుకు రైల్వే మెయిల్ సర్వీస్ క్యాటగిరిలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రతిభా పురస్కారం వరించింది. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ వారు రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరం డిసెంబర్ నెలలో నిర్వహించిన తపాలా జీవిత బీమా ప్రత్యేక డ్రైవ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన తపాలా ఉద్యోగులకు ఉత్తమ ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. విజయవాడలో ప్రత్యేకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోస్టల్ సర్వీసెస్ బోర్డు మెంబర్ కె.ప్రకాష్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. నవీన్ బాబును పలువురు రైల్వే అధికారులు, ఉద్యోగులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment