పెద్దతిప్పసముద్రం: మండలంలోని టి.సదుం పంచాయతీలోని పాపాగ్ని నదిలోని ఇసుకకు ఇటు ఆంధ్రా అటు కర్ణాటక రాష్ట్రంలోని మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అయితే గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు సమగ్రమైన ఆదేశాలు జారీ చేస్తూ స్టే ఇచ్చింది. అయితే స్థానికంగా ఉన్న పంచాయతీ ప్రజల గృహ అవసరాల నిమిత్తం ఇసుకను వాడుకోవచ్చని ఆదేశాలు ఉన్నాయి. ఇందుకు భిన్నంగా కూటమి నాయకులు ఇష్టారాజ్యంగా ఇసుకను తోడేస్తూ కోర్టు నిబంధనలను తుంగలో తొక్కుతూ జేబులు నింపుకుంటున్నారని ఈ పంచాయతీకి చెందిన రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాపాగ్ని నదిలోని ఇసుకను సునాయాసంగా తరలించేందుకు జేసీబీలతో రోడ్డును కూడా చదును చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. పంచాయతీకి చెందిన చోటా మోటా టీడీపీ నాయకులతో పాటు పక్క గ్రామాలు, మండలాలకు చెందిన కూటమి నాయకులు సైతం పాపాగ్ని నదిలోని ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేస్తుండటంతో తమ వ్యవసాయ బోర్లలో నీరు అడుగంటి పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పోలీసులు, రెవెన్యూ, భూగర్భ గనుల శాఖ అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని కోరుతున్నారు.
హైకోర్టు ఆదేశాలు బేఖాతర్
చోద్యం చూస్తున్న అధికారులు
సీమకు ద్రోహం చేస్తున్నారు
జమ్మలమడుగు: తరతరాలుగా రాయలసీమకు అన్యాయమే జరుగుతోందని.. ప్రస్తుత చర్యలు కూడ అలాగే ఉన్నాయని రాయలసీమ పరీరక్షణ సంఘం అధ్యక్షుడు ప్రతాపరెడ్డి మండిపడ్డారు. కడపలో స్టీల్‌ఫ్లాంట్‌ను నిర్మిస్తామని చెప్పి ప్రస్తుతం అనకాపల్లిలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పడం రాయలసీమకు తీవ్రమైన అన్యాయం చేయడమే ధ్వజమెత్తారు. బుధవారం స్థానిక ఐటీఐ ఆవరణలో విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు చేయకుండా ఎటువంటి హామీలేని అనకాపల్లి స్టీల్‌ఫ్లాంట్ ,విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం దాదాపు 11వేల కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment