చిరు దుకాణాన్ని కూల్చడం దుర్మార్గం
రామాపురం : బతుకుదెరువు కోసం ఏర్పాటు చేసుకున్న చిరు దుకాణాన్ని కూల్చేసి నష్టం చేయడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మండలంలోని రాచపల్లె పంచాయతీ సచివాలయం, పాఠశాల సమీపంలో గణేష్‌కుమార్‌రెడ్డి బతుకు దెరువు కోసం ఏర్పాటు చేసుకున్న చిరు దుకాణాన్ని నేలమట్టం చేసిన శిథిలాలను బుధవారం ఆయన పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ నిబంధనలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రే అధికార నివాసం ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఎవ్వరికి అడ్డు లేని ప్రాంతంలో బతుకుదెరువు కోసం చిన్న దుకాణం ఏర్పాటు చేసుకున్న వారిపై రాజకీయ కక్ష సాధించడం సమంజసం కాదన్నారు. ఇప్పటికే 46 సెంట్లు భూమి వారి పేరు మీద రెవెన్యూ రికార్డుల్లో ఉందన్నారు. పది మందికి విద్యనందించే పాఠశాల కోసం ఉచితంగా స్ధలం అందించిన వారికే నష్టం కలిగించడం దుర్మార్గమన్నారు. చిన్న చిన్న విషయాల్లో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవడం మంచి పరిణామం కాదన్నారు. అదే గ్రామంలో కొంత మంది ప్రభుత్వ భూములను ఆక్రమించి కంచెలు వేస్తుంటే రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు.
పరామర్శ..
రాచపల్లెకు చెందిన వెంకట్రామరాజు ఇటీవల మెకాలికి శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకొని శ్రీకాంత్‌రెడ్డి అతని స్వగృహానికి వెళ్లి పరామర్శించారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
శ్రీకాంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment