ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి

Published Thu, Jan 23 2025 12:19 AM | Last Updated on Thu, Jan 23 2025 12:20 AM

ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి

ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి

సుండుపల్లె : రైతులందరూ ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వ్యవసాయ జాయింట్‌ డైరెక్టర్‌ బి. చంద్ర నాయక్‌ తెలిపారు. సుండుపల్లె–3 రైతు సేవా కేంద్రం పరిధిలోని పెద్దమాదిగపల్లె గ్రామంలో బుధవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ సీజన్‌లో రైతులు సంబంధిత ఆర్‌ఎస్‌కే సిబ్బంది దగ్గర ఈ–పంట నమోదు చేసుకొని ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. పంటలను ఆశించే చీడపీడలు, తెగుళ్ల ఉధృతిని ఎన్‌పీఎస్‌ఎస్‌ యాప్‌ ద్వారా తెలుకొని వాటి నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎస్‌.మహబూబ్‌ బాషా, వ్యవసాయ అధికారి (టెక్నికల్‌) మోహన్‌, ఆర్‌ఎస్‌కె సిబ్బంది, ఏపీసీఎస్‌ఎఫ్‌ సిబ్బంది, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement