నిరుద్యోగులను మోసగించిన కూటమి ప్రభుత్వం
– ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి
పుల్లంపేట : కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడు నెలలు గడుస్తున్నా నిరుద్యోగ భృతి అందించకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని రాజంపేట ఎమ్మెల్యే, అన్నమయ్య జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి విమర్శించారు. బుధవారం జాగువారిపల్లి గ్రామంలో గీతారెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక్కో నిరుద్యోగికి రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అధికారం చేపట్టాక నట్టేట ముంచారన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా హామీలు అమలు చేయకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అనంతయ్యగారిపల్లి రాజారెడ్డి, శ్రీను, దండుగోపి తదితరులు పాల్గొన్నారు.
13 మద్యం బాటిళ్లు స్వాధీనం
వీరబల్లి : మండలంలోని తాటికుంటపల్లిలో హరీష్‌కు చెందిన చిల్లర దుకాణంలో 13 మద్యం బాటిళ్లను స్వా ధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ మోహన్ నాయక్ తెలిపా రు. మద్యం బాటిళ్లు అధిక రేట్లకు అమ్ముతున్నారనే స మాచారం మేరకు దాడి నిర్వహించి బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిందితునిపై కేసు నమోదు చేశామన్నారు.
మహిళ ఆసుపత్రికి తరలింపు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయం వద్ద మూర్ఛకు గురైన మండలంలోని మంటపంపల్లి గ్రామానికి చెందిన వెంకట సుబ్బమ్మ (50) అనే మహిళను ఆలయ విజిలెన్సు సిబ్బంది హుటా హుటిన ఒంటిమిట్ట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆసుపత్రిలో ఉన్న డ్యూటీ డాక్టర్ ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వైద్యాధికారి స్పష్టం చేశారు.
ఇద్దరు యువకులకు గాయాలు
కురబలకోట : కురబలకోట రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద బుధవారం రాయచోటికి చెందిన ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడినట్లు ఎస్‌ఐ దిలీప్‌కుమార్ తెలిపారు. రాయచోటి నుంచి ఫైజాన్(22), అతని స్నేహితుడు ఫర్హాన్(22) బైకులో మదనపల్లెకు వస్తుండగా రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద అదుపు తప్పి కిందపడ్డారు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను 108 సిబ్బంది మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫైజాన్‌ను బెంగళూరు ఆసుపత్రికి తరలించారు.
కోర్టు ఉత్తర్వులు
ఉల్లంఘించి రోడ్డు నిర్మాణం
రైల్వేకోడూరు అర్బన్ : కోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ రైల్వేకోడూరు లక్ష్మీ ప్యారడైజ్ ఎదురుగా రోడ్డు నిర్మిస్తున్నారని బుధవారం స్థల యజమాని ప్రసాద్ కోడూరు సీఐ హేమసుందర్ రావుకు ఫిర్యాదు చేశారు. హైకోర్టు నుండి ఉత్తర్వులు పొందినప్పటికీ పట్టించుకోకుండా అధికారులు రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
రైలు కింద పడి
బేల్దారి ఆత్మహత్య
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ పరిధిలో కడప వైపు వెళ్లే రైల్వేలైన్ వద్ద దేరంగుల ఆంజనేయులు (36) బుధవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలకు అనంతపురం జిల్లా యాడికి మండలానికి చెందిన ఆంజనేయులు బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇతనికి భార్య, నలుగురు సంతానం ఉన్నారు. ఐదు నెలల క్రితం ఎర్రగుంట్లకు వచ్చి బేల్దారి పనులు చేసునేవాడు. ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment