అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి
రాయచోటి: ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం జగనన్న కాలనీల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాయచోటి మండలం, దిగువ అబ్బవరం గ్రామ పరిధిలోని అబ్బవరం, ఏపీ మోడల్ స్కూల్ ఎదురుగా ఉన్న లేఔట్లలో సీసీ రోడ్ల నిర్మాణ ప్రగతి, విద్యుత్ పోల్స్, లైన్ల ఏర్పాటు, నీటి వసతి, ఆర్చి నిర్మాణం తదితరాలపై పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు జారీ చేశారు. ఫిబ్రవరి నెల మొదటి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉంటుందన్న సమాచారంతో లేఔట్లలో మౌలిక వసతులు కల్పించే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ దయాకర్ రెడ్డి, హౌసింగ్, డ్వామా పీడీలు శివయ్య, వెంకటరత్నం, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ ప్రసన్న కుమార్, డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణ, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ సహదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment