ఆకతాయిల నుంచి రక్షణ కల్పించాలి
సుండుపల్లె : మండలంలో పదోతరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినులను ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో కొంతమంది ఆకతాయిలు వేధిస్తున్నారని గిరిజన స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు నాగేంద్ర నాయక్ చౌహాన్, గిరిజన స్టూడెంట్స్ ఫెడరేషన్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు నాగన్న తెలిపారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రాథమికోన్నత పాఠశాల గ్రౌండ్‌లో నుంచి ఇంటికి వెళుతున్న బాలికల పట్ల ఒక రెవెన్యూ అధికారి కుమారుడు అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. ఆకతాయిల నుంచి బాలికలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment