జ్యోతి క్షేత్రంలో 7న సమావేశం
కాశినాయన : జ్యోతి క్షేత్ర పరిరక్షణ కోసం ఈనెల 7వ తేదీ ఉదయం 10 గంటలకు జ్యోతిక్షేత్రంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని తోట్లపల్లె అచలానంద ఆశ్రమం పీఠాధిపతి నీరజానందస్వామి తెలిపారు. జ్యోతి క్షేత్రంలోని కొన్ని భవనాలకు అటవీశాఖ అనుమతులు లేవని ఇటీవల కాలంలో మూడు సార్లు కూల్చి వేశారని, దీన్ని అడ్డుకునేందుకు అందరం సమష్టిగా పనిచేయాలని అన్నారు. శనివారం జ్యోతిక్షేత్రాన్ని ఆయన సందర్శించి కూల్చిన కట్టడాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశినాయన పాడుబడిన దేవాలయాలను పునరుద్ధరించి అన్నదానం ఏర్పాటు చేసిన మహారుషి అన్నారు. అలాంటి ఆయన క్షేత్రాన్ని అటవీశాఖ అనుమతు లు లేవంటూ అటవీశాఖ అధికారులు కూల్చేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. ఈ సమావేశానికి అన్ని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలన్నారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల కాశినాయన భక్తులు పాల్గొన్నారు.
హాస్టల్ ఉద్యోగిపై
చర్యలు తీసుకుంటాం
కాశినాయన : మండల కేంద్రమైన నరసాపురంలోని ఎస్సీ హాస్టల్‌లో శుక్రవారం రాత్రి అక్కడ పనిచేసే రవికుమార్ అనే హాస్టల్ ఉద్యోగి హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థిని బెల్టుతో వీపుపై చితకబాదాడు. విషయం తెలుసుకున్న సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి శనివారం హాస్టల్‌ను సందర్శించారు. ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment