సంపద సృష్టి అంటే ఏమిటి బాబూ?
రాయచోటి టౌన్ : సంపద సృష్టి అంటే ఏమిటి బాబూ.? విద్యుత్ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం, వైన్ షాపుల టెండర్ల ద్వారా రూ.20 వేల కోట్లు దండుకోవడమా అని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి శిబ్యాల విజయభాస్కర్ ప్రశ్నించారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిలో మాత్రం రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచకుండా రాష్ట్ర మంతటా పెంచడం ఏమిటన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెండచం, జగన్ మోహన్‌రెడ్డి ఇస్తున్న పథకాలన్నింటీనీ ఆపేయడం కూడా సంపద సృష్టి అవుతుందా అని నిలదీశారు. సూపర్ సిక్స్ అన్నారు.. గద్దెనెక్కగానే ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. లోకేష్ ఏమో ప్రతి సంవత్సరం జనవరికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 20 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.. కానీ అందుకు భిన్నంగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులనే తొలగించే పనులు మొదలు పెట్టారన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 99 శాతం హామీలను అమలు చేశారన్నారు. కానీ టీడీపీ అధికారంలోకి రాగానే ప్రజలపై వివిధ రకాల పన్నులు విధిస్తోందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సుగవాసి శ్యామ్, కొత్తిమీర ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment