మాజీ మంత్రి పెద్దిరెడ్డి లక్ష్యంగా గోబెల్స్ ప్రచారం
వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్
మదనపల్లె : మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుటుంబ సభ్యులకు ఉన్న ప్రజాదరణ, నిబద్ధత, నిజాయితీ చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పథకం ప్రకారం కావాలనే అనుకూల పత్రికలో గోబెల్స్ ప్రచారం చేయిస్తున్నారని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ అన్నారు. శనివారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...రాజకీయంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే పచ్చమీడియా ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారన్నారు. 2001లో ఆయన చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూములను అటవీభూమి అంటూ ప్రచారం చేస్తూ, ఆక్రమణలకు పాల్పడ్డారని తప్పుడు కథనాలు రాయిస్తున్నారన్నారు. అటవీ భూములు ఆక్రమించుకోవాల్సిన ఆగత్యం పెద్దిరెడ్డి కుటుంబానికి లేదన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేని చంద్రబాబునాయుడు ప్రతినెలా ఏదో ఒక అంశంపై విపరీత ప్రచారం చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ప్రచార విభాగం అధ్యక్షుడు పోతబోలు నాగరాజు, ఐటీ విభాగం అధ్యక్షుడు డాకరాజుగారి అరవింద్ తిలక్, మహిళా విభాగం అధ్యక్షురాలు నీరుగట్టు మేరీ, నాగరాజరెడ్డి, జన్నే రాజేంద్రనాయుడు, కోటూరి ఈశ్వర్, మహేష్ తదితరులు నిసార్‌అహ్మద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment