బాలల కోసం బంగారు లోకం
● వేలాదిమందితో బాలోత్సవం
● 20కి పైగా పలు రకాల పోటీలు
● ప్రాంగణమంతా బాలల సందడే సందడి
కడప కల్చరల్ : ఆ ప్రాంగణమంతా ఉదయం నుంచి సా యంత్రం వరకు బాలల కోసం ఏర్పడిన బంగారు లోకాన్ని తలపించింది. బడి అన్న బిడియం, పాఠాలన్న భయం, అయ్యవార్లు దండిస్తారేమోనన్న అనుమానాలు లేనే లేవు. రెక్కలు వచ్చిన కొత్త పక్షుల్లా సాయంత్రం వరకు ఆడిపాడి ఆనందించారు. కడప బాలోత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో రెండవ ఉత్సవం తొలిరోజు కార్యక్రమాన్ని శనివారం స్థానిక సెయింట్ జోసెఫ్ హైస్కూలులో నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్ జాతీయ పతాకావిష్కరణ చేసి కార్యక్రమాన్ని, కమిటీ బాధ్యులు రాజా వెంగళరెడ్డి ఇతర కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ఒక ఉత్సవంలో ఇంతమంది విద్యార్థులు పాల్గొనడం ఇదే మొదటిసారన్నారు. ఇది తమతోపాటు నిర్వాహకులకు ఎంతో సంతోషాన్ని, ఉత్సాహ ప్రోత్సాహాలను కలిగిస్తోందన్నారు. ప్రోత్సహించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అభినందించారు. మానసిక వికాసం, శాసీ్త్రయ దృక్పథం పెరిగేందుకు, మానవత్వాన్ని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయన్నారు. నిర్వాహకులను అభినందించారు. మండల విద్యాశాఖ అధికారి గంగిరెడ్డి, బాలోత్సవం గౌరవ సలహాదారులు వీర సుదర్శన్ రెడ్డి, గౌరవాధ్యక్షులు నాగముని రెడ్డి, అధ్యక్షులు గుర్రాల గోపాల్, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రాహుల్, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ మృత్యుంజయరావు , డాక్టర్ ఓబుల్ రెడ్డి, కార్యదర్శి వెంకటసుబ్బయ్య, ఉషా తులసి, సుందరయ్య, డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి, రఘునాథరెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆవిష్కరణలు ఆశ్చర్యకరం
కార్యక్రమాలకు జిల్లా నలుమూలల నుంచి తమదైన శైలిలో బుర్రలకు పదునుపెట్టి పెద్దలు ఆశ్చర్యపోయే లా వస్తువులను తయారు చేసుకుని వచ్చారు. తొలిరో జు 12 అంశాలలో సీనియర్లు, జూనియర్, సబ్ జూనియర్ విభాగాలుగా పోటీలు నిర్వహించారు. జానప ద, శాసీ్త్రయ నృత్యాలు, దేశభక్తి గీతాల ఆలాపన, రెయి మ్స్, విచిత్ర వేషధారణ తదిత ర అంశాలలో దాదాపు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రాంగణంలో మొత్తం నాలుగు విభాగాలుగా వేదికలను ఏర్పాటు చేశారు. ప్రతి విభాగానికి సరిపడ నిర్వాహకులు, కో ఆర్డినేటర్లు, న్యాయ నిర్ణేతలు తదితరులు కార్యక్రమాన్ని సజావుగా నడిపించేందుకు తమవంతు సహకారం అందజేశారు.
ఆకర్షణీయం
ఈ ఉత్సవంలో ప్రధానంగా మట్టితో బొమ్మలు చేసే నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంది. దినపత్రిక పఠనం, కథలు చెప్పడం, బెస్ట్ ఫ్రం వేస్ట్, కార్టూన్లు, మెమొరీ టెస్టు తదితర అంశాలను పెద్దలను సైతం ఆశ్చర్యపరిచాయి. నృత్య వేదికపై చిన్నారులు చేసిన శివతాండవం, పుష్ప–2 జాతర సందర్శకులను ఉర్రూతలూగించాయి.
Comments
Please login to add a commentAdd a comment