లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో చోరీ
వీరబల్లి : మండలంలోని పెద్దవీటి పంచాయతీ, రెడ్డివారిపల్లి దగ్గర గుట్టపై ఉన్న అతి పురాతన లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బుధవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఏఎస్‌ఐ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ముళ్ల పొదల్లో పడేసిన హుండీని పరిశీలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రాజంపేట హైవేపై రోడ్డు ప్రమాదం
రాజంపేట : రాజంపేట మండలం రామాపురం పంజాబీ డాబా వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. నందలూరు వైపు నుంచి ద్విచక్ర వాహనంపై ఆకేపాడుకు వెళ్తున్న వ్యక్తిని ట్రాక్టర్ ఢీ కొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానికులు 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సబ్ స్టేషన్ పోరంబోకు స్థలం కబ్జా
ఓబులవారిపల్లె : కొర్లకుంట సబ్ స్టేషన్ ప్రహరీ పక్కనే ఉన్న పోరంబోకు స్థలాన్ని యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. కొన్నేళ్లుగా నాయీ బ్రాహ్మణులు తమ పొట్టకూటి కోసం బంకులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే గ్రామంలోని కబ్జాదారుల కన్ను కొర్లకుంట గ్రామానికి వచ్చే ప్రధాన రహదారుల పక్కన ఉన్న ఖాళీ స్థలంపై పడింది. దీంతో ఎవరి అనుమతులు లేకుండా యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడి పక్కా భవనాలు నిర్మించుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. రెవెన్యూ అధికారు లు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు విద్యుత్ సబ్ స్టేషన్ పోరంబోకు స్థలానికి కబ్జాదారుల నుంచి విముక్తి కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment