సింగిల్ విండోలో నాణ్యతలేని బంగారంపై రుణాలు
తంబళ్లపల్లె : మండల కేంద్రంలోని కన్నెమడుగు సహకార సొసైటీ సింగిల్ విండో బ్యాంకులో నాణ్యతలేని బంగారంపై రుణాల పంపిణీ జరిగినట్లు తెలిసింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు. బుధవారం మదనపల్లె సబ్ డివిజనల్ కోఆపరేటివ్ బ్యాంకు అఽధికారి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, పర్సన్ ఇన్‌చార్జి స్వర్ణలత రుణాల పంపిణీపై విచారణ జరిపారు. ఈ విచారణ మూడు రోజుల పాటు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మొదట బ్యాంకులో అప్రైజర్‌గా పని చేసిన క్రిష్ణమూర్తి ఆచారిని విచారించారు. బ్యాంకులో 17 మంది ఖాతాదారులకు రూ.32 లక్షల బంగారు తాకట్టుపై రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ తాకట్టు బంగారంలో నాణ్యతలేదని అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై ఖాతాదారులను కూడా బ్యాంకుకు పిలిపించి సమగ్ర విచారణ చేస్తామన్నారు. విచారణ పూర్తికాగానే పూర్తి విషయాలు వెల్లడిస్తామన్నారు. బంగారు నాణ్యత లేక పోయినా నకిలీదిగా నిర్ధారణ అయినా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఇద్దరు ఖాతాదారులు రూ.2.75 లక్షలు డబ్బులు చెల్లించి నగలు విడిపించుకున్నారు.
ఉన్నతాధికారుల విచారణ
Comments
Please login to add a commentAdd a comment