●వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులే లక్ష్యంగా.. | - | Sakshi
Sakshi News home page

●వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులే లక్ష్యంగా..

Published Wed, Feb 12 2025 10:17 AM | Last Updated on Wed, Feb 12 2025 10:18 AM

●వైఎస

●వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులే లక్ష్యంగా..

సాక్షి రాయచోటి: పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గూడు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించేందుకు వైఎస్‌జగన్‌ సర్కార్‌ సంకల్పించింది. అర్హులైన వారందరికీ పట్టాలు మొదలుకొని స్థలాలకు సంబంధించి పట్టాలు అందజేసి పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు పయనించింది. కులం, మతం, వర్గం అన్న తేడా లేకుండా ఒకవైపు సంక్షేమ పలాలను అందిస్తూ మరోవైపు పేద వారి అభ్యున్నతికి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. అయితే కాలంలో మార్పులు రావడం...ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సర్కార్‌ అధికారంలోకి రావడంతో పరిస్థితి తారుమారైంది. జిల్లా వ్యాప్తంగా నిరుపేదలకు ఇచ్చిన స్థలాలతోపాటు పక్కా గృహ నిర్మాణాలకు సంబంధించి ప్రత్యేకంగా పరిశీలనకు ఇప్పటి సర్కార్‌ ముందుకు కదులుతోంది. నిరుపేదల్లో అనర్హుల పేరుతో క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం పట్టాలను రద్దు చేసేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు.

ఇల్లు నిర్మించుకోకపోతే పట్టా రద్దు

జిల్లాలోని కాలనీల్లో స్థలాలకు సంబంధించి పట్టాలు తీసుకుని ఇంటి నిర్మాణం ప్రారంభించని పట్టాలను రద్దు చేసే దిశగా అధికార యంత్రాంగం కదులుతోంది. అందుకు సంబంధించి సోమవారం నుంచి 15 రోజులపాటు ప్రత్యేక బృందాలతో కూడిన టీములు నిశిత పరిశీలన చేపట్టాయి. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇల్లు నిర్మించుకోలేకపోయిన వారి పట్టాలను రద్దు చేయనున్నారు. ఇప్పటికే ఇంటి పట్టాల రద్దు వ్యవహారంపై కూటమి సర్కార్‌ గతంలోనే క్లారిటీ ఇచ్చింది. జిల్లాలో ఇంటి పట్టాలు తీసుకుని కారణాలు ఏవైనా ఇప్పటివరకు నిర్మాణాలు మొదలు పెట్టని వారి పట్టాలతోపాటు బేస్‌మెంట్‌ స్థాయిలో ఉన్న వాటిని కూడా రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. తద్వారా చాలామంది పేదలకు సంబంధించిన స్థలాలకు ప్రభుత్వం ఎసరుపెట్టేలా కనిపిస్తోందని లబోదిబోమంటున్నారు.

కాలనీల్లో పరిశీలనకు బృందాలు: జిల్లాలోని జగనన్న లే–అవుట్లతోపాటు ఇతర కాల నీల్లో స్థలాల పరిశీలనకు టీములు కదులుతున్నాయి. ప్రధానంగా సర్వేయర్‌తోపాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, వీఆర్వోలతో కూడిన బృందాలు స్థానికంగా ఉన్న కాలనీల్లోకి వెళ్లి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకున్నారా? లేదా?, అలాగే నిర్మించుకున్న వారే ఉంటున్నారా? లేక ఇతరులకు ఇచ్చారా? పట్టాలు తీసుకున్న వారికి సంబంధించి గతంలో ఏవైనా గృహాలు ఉన్నాయా? సొంత వాహనాలు ఉన్న వారు తీసుకున్నారా? ఇల్లు నిర్మించుకోకపోవడానికి కారణాలు, బేస్‌మెంట్‌ స్థాయిలో నిలబెట్టేందుకు కారణాలు ఇలా అనే అంశాలపై విచారణ చేపట్టనున్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలనతోపాటు విచారణ కార్యక్రమం దాదాపు 15 రోజులపాటు కొనసాగనున్నట్లు అధికారుల ద్వారా తెలియవచ్చింది. ఏది ఏమైనా పేద ప్రజలకు సంబంఽధించిన పట్టాలు, ఇళ్ల విషయంలో ప్రభుత్వం అనర్హత పేరుతో ఏరివేతకు రంగం సిద్ధం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జగనన్న కాలనీల్లో అనర్హుల పేరుతో ఏరివేతకు సర్కార్‌ నిర్ణయం

జిల్లాలో సుమారు 74 వేలకు పైచిలుకు గృహాలు మంజూరు

ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గృహాల లబ్ధ్దిదారులు

అన్నమయ్య జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లోనూ జగనన్న కాలనీలు రూపుదిద్దుకున్నాయి. పట్టణ ప్రాంతాల్లో అయితే సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో రెండు సెంట్ల చొప్పున అప్పటి ప్రభుత్వం పేదలకు కేటాయించింది. ఎక్కడికక్కడ కేటాయించిన స్థలాలకు సంబంధించి ఒత్తిడి తీసుకొచ్చి ఇల్లు నిర్మించుకునేలా కృషి చేశారు. జిల్లాలోని 513 లే– అవుట్లలో సుమారు 74 వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి సర్కార్‌ ఎలాగోలా వైఎస్సార్‌ సీపీ సానుభూతి పరులను, నాయకులను ఇబ్బంది పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. ఎక్కడికక్కడ ఇల్లు కట్టుకోలేని నిరుపేదలతోపాటు వైఎస్సార్‌ సీపీకి చెందిన వారు స్థలాలు పొందినట్లయితే వాటిని రద్దు చేయించేలా చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా ఇటీవల రాయచోటి, పీలేరు తదితర ప్రాంతాల్లోని లే అవుట్లపై విస్తృతంగా ఆక్రమణల పేరుతో ప్రచారానికి తెర తీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
●వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులే లక్ష్యంగా.. 1
1/2

●వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులే లక్ష్యంగా..

●వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులే లక్ష్యంగా.. 2
2/2

●వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులే లక్ష్యంగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement