![సౌమ్యనాథ స్వామికి రూ.4,96,388 ఆదాయం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11mdpl14-400010_mr-1739334217-0.jpg.webp?itok=Wa6ffqJA)
సౌమ్యనాథ స్వామికి రూ.4,96,388 ఆదాయం
నందలూరు: నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. రూ. 4,96,388లు వచ్చినట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకనెల హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు చెప్పారు.వచ్చిన మొత్తాన్ని బ్యాంకులోని ఆలయ ఖాతాలో జమ చేస్తామని వివరించారు.కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ గురుస్వామి యాదవ్, విజిలెన్స్ అధికారి భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
శివరాత్రికి ప్రత్యేక బస్సులు
మదనపల్లె సిటీ: మహాశివరాత్రికి శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం సిబ్బందితో గేట్ మీటింగ్ నిర్వహించారు. శైవక్షేత్రాలకు వెళ్లే బస్సులు కండీషన్‌లో పెట్టాలని ఆదేశించారు. ఈపీకె.ఓఆర్‌లో రీజియన్‌లో ప్రథమ స్థానం, కేఎంపీఎల్‌లో రీజియన్‌లో రెండో స్థానంలో ఉన్నాయన్నారు.సిబ్బంది క్రమశిక్షణతో పని చేసి డిపో ఆదాయం పెంచాలన్నారు. కార్యక్రమంలో సీఐ రేవతి, ఎంఎఫ్ రవి,సిబ్బంది పాల్గొన్నారు.
12న డయల్ యువర్ డీఎం: డిపో పరిధిలో సమస్యలు, ఆర్టీసీ ఆదాయం పెంచడానికి ఈనెల 12వతేదీన డయల్ యువర్ డీఎం కార్యక్రమంల నిర్వహిస్తున్నట్లు డీఎం తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. 99592 25676 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.
దరఖాస్తుల ఆహ్వానం
రాయచోటి జగదాంబసెంటర్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025 –26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో (ఇంగ్లీష్ మీడియం) ప్రవేశానికి బాలురు, బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుందన్నారు. మార్చి 6వ తేదీలోగా https://apbragcet. apcfss.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 6న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 5వ తరగతికి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి ప్రవేశ పరీక్ష అదే రోజు మధ్యాహ్నం 2 నుండి 4.30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు.
ఎంట్రీఫీజు టెండర్
రూ.19 లక్షలు
బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పై అటవీశాఖ సముదాయంలోకి ప్రవేశించేందుకు వసూలు చేసే ఎంట్రీఫీజు గుత్త అప్పగించేందుకు నిర్వహించిన టెండర్లలో అత్యధిక ఆదాయం లభించింది. మంగళవారం రాజంపేట డీఎఫ్‌ఓ కార్యాలయంలో టెండర్ల నిర్వహణ జరిగింది. 2017లో మొదటిసారి ఈ ఎంట్రీఫీజు వసూలును ప్రారంభించారు. అప్పుడు ఎంట్రీ ఫీజు రూ.10 ఉండగా ఆ ఏడాది రూ.6,07,500 లీజు అప్పగించారు. తర్వాత వరుసగా ప్రతిఏటా లీజు విలువ పెరుగుతూ వస్తోంది. 2024లో రూ.14 లక్షలు పలకగా ప్రస్తుతం 2025 ఏడాదికి లీజు అప్పగింతకు బిడ్ విలువ రూ.15.50 లక్షలుగా నిర్ణయించగా టెండర్లలో నలుగురు పాల్గొన్నారు. వీరిలో విజయ్‌కుమార్‌రెడ్డి రూ. 19,00,008తో టెండర్ దాఖలు చేయడంతో లీజు ఆయనకు దక్కింది. అటవీసముదాయంలోని క్యాంటిన్ నిర్వహణకు బిడ్ రూ.1.50 లక్షలు నిర్ణయించగా ఇద్దరు టెండర్లు దాఖలు చేయగా అహ్మద్ సుౖౖసైల్ రూ.1,57,800కు టెండర్ దక్కించుకున్నారు. మానస సరోవరంలో బోటింగ్ లీజకు బిడ్ రూ.10.50 లక్షలు నిర్ణయించగా పాల్గొన్న టెండర్‌దారులు రూ.7 లక్షలకే దాఖలు చేయడంతో ఆ టెండర్‌ను రద్దు చేశారు. బోటింగ్‌కు తిరిగి టెండర్లు నిర్వహిస్తామని డీఎఫ్‌ఓ జగన్నాఽథ్‌సింగ్ తెలిపారు.
విద్యార్థుల ఫోన్లకు హాల్‌టిక్కెట్లు
మదనపల్లె సిటీ: ఇంటర్‌లో ఈసారి గతంలో కంటే మెరుగైన ఫలితాలను సాధించడానికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటు న్నామని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి క్రిష్ణయ్య అన్నారు.మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయని, ఈసారి ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి విద్యార్థి ఫోన్ నంబర్‌కు హాల్‌టిక్కెట్టును పంపిస్తామని చెప్పారు. దీనిపై ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు గతంలో ప్రైవేటు కాలేజీలో ఫీజలు చెల్లిస్తేనే హాల్‌టిక్కెట్టు ఇస్తారు, లేకపోతే హాల్‌టిక్కెట్టు ఇవ్వరు అనే ఫిర్యాదులు ఉండవన్నారు. ఈ ఏడాది నూతనంగా ఈ చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లాలో ప్రాక్టికల్స్ పరీక్షలు సీసీ కెమెరాల నిఘా నీడలో జరుగుతున్నాయని, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. ఉత్తమ ఫలితాల సాధనకు ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాల మేరకు సంకల్ప –25 పేరుతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్టడీ మెటీరియల్ అందజేశాం. అధ్యాపకులకు విద్యార్థులకు దతత్త పేరిట అమలు చేస్తున్నాం. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment