![దాష్టీకం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11rkd102-170025_mr-1739334219-0.jpg.webp?itok=0oLNt0kl)
దాష్టీకం
పోలీసుల
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా?
సాక్షి, టాస్క్‌ఫోర్స్: అన్నమయ్య జిల్లా పుల్లంపేట భార్యాభర్తల గొడవలో భర్త శివప్రసాద్‌ను పోలీసులు విచక్షణా రహితంగా చితకబాదారు. ఒళ్లంతా లాఠీ దెబ్బలతో కందిపోయింది. మండల కేంద్రానికి చెందిన బాధితుడు బొమ్మిశెట్టి శివప్రసాద్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తనకు, తన భార్య మాధురికి స్వల్ప ఘర్షణ జరిగిందని, దీంతో ఆమె 100కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పుల్లంపేట పోలీసులు మంగళవారం తెల్లవారుజామున తనను కొట్టుకుంటూ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. లాఠీ విరగడంతో డ్రిప్పు పైపుతో సైతం విపరీతంగా కొట్టారు. తనకు ఆపరేషన్ జరిగిందని, కాళ్లలో రాడ్లు వేశారని కాళ్లు పట్టుకుని బతిమలాడినా వదలకుండా ముఖంపై బూటు కాలుతో తన్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.. ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసు అంటున్నా..క్షేత్రస్థాయిలో పోలీసుల తీరు చూస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అంటూ ప్రజాసంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. బాధితుడిని అఖిలపక్ష నాయకులు పరామర్శించారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనపై విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసులపై హోంమంత్రి చర్యలు తీసుకోవాలని శివప్రసాద్ డిమాండ్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment