అర్జీలకు సత్వరమే పరిష్కారం చూపాలి
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్
రాయచోటి: రెవెన్యూ సదస్సులు, పీజీఆర్‌ఎస్‌లలో వచ్చిన అర్జీల ను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఎంఆర్‌ఓలు, సర్వేశాఖ సిబ్బంది, వీఆర్‌ఓలతో వీసీ ద్వారా వివిధ అంశాలపై సమీక్ష సమా వేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డిఆర్‌ఓ మధుసూదనరావు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, సర్వేశాఖ ఏడీ, ఎంఆర్‌ఓ లు, రెవెన్యూసిబ్బంది, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.
మహిళలు ఆర్థికంగా అభ్యున్నతి చెందాలి
ప్రభుత్వం అందజేస్తున్న రాయితీ రుణాలను పొంది జీవనోపాదులను మెరుగుపరుచుకొని ఎస్సీ మహిళలు ఆర్థికంగా అభ్యున్నతిని సాధించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అన్నారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సెర్ఫ్, ఎస్సీ కార్పోరేషన్, ఏపీ షెడ్యూల్డ్ క్యాస్ట్ కో–ఆపరేటీవ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత స్వయం సహాయక సంఘాల్లో ఉన్న ఎస్సీ మహిళలకు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం ప్రధాన మంత్రి అను సుచిత్ జాతి అభ్యుదయ యోజన పథకంపై ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా స్వయం సహాయక సంఘాలలో ఉన్న ఎస్సీ మహిళల జీవనోపాధుల మెరుగుదలకు రాయితీతో వడ్డీలేని రుణాలను అందజేస్తున్నామని కలెక్టర్ అన్నారు. అనంతరం మంజూరైన రుణాలను మహిళలకు అందజేశారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజ్యలక్ష్మీ, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి దాసరి నాగార్జున, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment