![ఘనంగా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11kdp203a-603002_mr-1739334218-0.jpg.webp?itok=3oNsKG_F)
ఘనంగా లూర్దుమాత తిరునాల
కడప కల్చరల్: కరుణామయి, ప్రేమమూర్తి ఏసుక్రీస్తును ఈ లోకానికి అందించిన దయగల తల్లి లూర్దుమాత తిరునాల మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం మరియాపురంలోని పాత గుడివద్ద బిషప్, కడప అపోస్థలిక పాలనాధికారి గాలి బాలి సమిష్ఠి బలిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లూర్దుమాత ఆశీస్సులతోనే నవదిన ఉత్సవాలు వైభవంగా నిర్వహించగలిగామని, ఆమెతోపాటు ప్రభువైన ఏసుక్రీస్తుకు దైవానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన లూర్దుమాత దర్శనమిచ్చిన సంఘటనలను వివరించి వాక్యపరిచర్య చేశారు. మరియాపురం క్రీస్తు జ్యోతి కాన్వెంట్ ప్రతినిధులు వేదికను, ప్రార్థనా పీఠాన్ని ఆకర్శణీయంగా అలంకరించారు. కడప మేత్రాసనం ఫాదర్లు సంగీత సహకారం, దైవార్చన కార్యక్రమాలను పర్యవేక్షించారు. కడప నగరంలోని డాన్‌బాస్కో ఐటీఐ వద్ద నుంచి భక్తులు మరియమాత స్వరూపాన్ని ఊరేగింపుగా మరియాపురంలోని పాత చర్చి వద్దకు తీసుకొచ్చారు.
తిరునాల సందడే సందడి: లూర్దుమాత నవదిన ఉత్సవాల ముగింపు సందర్భంగా పాత చర్చి ఆవరణలో తిరునాల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎద్దులతో బండలాగుడు పోటీలను నిర్వహించారు. విజేతలైన ఎడ్ల యజమానులకు అతిథులు బహుమతులు అందజేశారు.
![ఘనంగా లూర్దుమాత తిరునాల 1](https://www.sakshi.com/gallery_images/2025/02/12/11kdp207-603002_mr-1739334218-1.jpg)
ఘనంగా లూర్దుమాత తిరునాల
Comments
Please login to add a commentAdd a comment