శ్రీ∙క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: శు.దశమి సా.5.31 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: పూర్వాషాఢ సా.6.04 వరకు,తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: రా.1.58 నుండి 3.30 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.22,నుండి 1.10 వరకు, అమృత ఘడియలు: ప.1.12 నుండి 2.49 వరకు.
సూర్యోదయం : 5.50
సూర్యాస్తమయం : 6.03
రాహుకాలం : ఉ.10.30
నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం: వ్యయ ప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. బం«ధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
వృషభం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
మిథునం: కుటుంబంలో ఉత్సాహంగా గడుస్తుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి
కర్కాటకం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమర్థత నిరూపించుకుంటారు.
సింహం: పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువర్గంతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
కన్య: సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. ప్రయాణాలు వాయిదా . వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.
తుల: సన్నిహితులతో సఖ్యత. బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
వృశ్చికం: చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
ధనుస్సు: ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
మకరం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బం«ధువులు, మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
మీనం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆర్థికంగా బలపడతారు. స్థిరాస్తి వృద్ధి. నిర్ణయాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment