Horoscope Today: ఈ రాశివారికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది | Daily Horoscope 15 September 2024 In Telugu | Sakshi
Sakshi News home page

Horoscope Today: ఈ రాశివారికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది

Published Sun, Sep 15 2024 8:56 AM | Last Updated on Sun, Sep 15 2024 12:23 PM

Daily Horoscope 15 September 2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: శు.ద్వాదశి ప.3.01 వరకు తదుపరి త్రయోదశి, నక్షత్రం: శ్రవణం సా.4.56 వరకు తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: రా.8.45 నుండి 10.16 వరకు, దుర్ముహూర్తం: సా.4.23 నుండి 5.12 వరకు, అమృతఘడియలు: ఉ.6.31 నుండి 8.25 వరకు. 

మేషం:  వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. కొత్త వస్తువుల సేకరణ. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

వృషభం: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో ఆటంకాలు.  ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: .వ్యవహారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. సోదరులు, మిత్రులతో కలహాలు. వ్యాపార లావాదేవీలు సామాన్యస్థితి. ఉద్యోగాలలో సమస్యలు పెరుగుతాయి.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

సింహం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. శుభవార్తలు వింటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలస్థితి.

కన్య: సన్నిహితులతో తగాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

తుల: ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృశ్చికం: పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. కీలక నిర్ణయాలు. ధనలాభం. వ్యవహార విజయం. వ్యాపారాలు వృద్ధి. ఉద్యోగాలలో కొంత పురోగతి.

ధనుస్సు: పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువర్గంతో విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో సామాన్య లాభాలు. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

మకరం: ఉద్యోగ, వివాహయత్నాలు కలసివస్తాయి. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

కుంభం: చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మీనం: చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో పురోగతి. ఆస్తి వివాదాలు పరిష్కారం. ధన,వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement