Horoscope Today: ఈ రాశివారు బంధువులతో సంతోషంగా గడుపుతారు | Daily Horoscope 21 September 2024 In Telugu | Sakshi
Sakshi News home page

Horoscope Today: ఈ రాశివారు బంధువులతో సంతోషంగా గడుపుతారు

Published Sat, Sep 21 2024 6:18 AM | Last Updated on Sat, Sep 21 2024 10:11 AM

Daily Horoscope 21 September 2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: బ.చవితి రా.11.23 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: అశ్వని ఉ.8.02 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: సా.5.02 నుండి 6.32 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.53 నుండి 7.29 వరకు, అమృతఘడియలు: రా.2.01 నుండి 3.33 వరకు, సంకటహర చతుర్ధి; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.52, సూర్యాస్తమయం: 5.57. 

మేషం: నూతన పరిచయాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వృషభం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. మిత్రులు, బంధువులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మిథునం: పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ముఖ్య నిర్ణయాలు వాయిదా. విద్యార్థులకు శ్రమాధిక్యం. ధనవ్యయం.. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కర్కాటకం: బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తులు కొనుగోలు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

సింహం: సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కన్య: వ్యవహారాలు ముందుకు సాగవు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో  చికాకులు..

తుల: ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. పనులు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం. పుణ్యక్షేత్రాల సందర్శనం. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.

వృశ్చికం: పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. వస్తు, వస్త్రలాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. దైవదర్శనాలు. ప్రముఖుల పరిచయం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

ధనుస్సు: మిత్రులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. పనులు వాయిదా. కళాకారులకు అవకాశాలు చేజారతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు.

మకరం: సన్నిహితుల సాయం అందుతుంది. విద్యార్థులకు శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. నూతన పరిచయాలు. అతి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కుంభం: రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులు మరింత వేగంగా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత. దైవదర్శనాలు. రాబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement