Today Horoscope: ఈ రాశివారికి దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి | Today Telugu Horoscope On July 6th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశివారికి దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి

Published Sat, Jul 6 2024 6:39 AM | Last Updated on Sat, Jul 6 2024 9:18 AM

Daily Horoscope On July 06, 2024 In Telugu

శ్రీక్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: శు.పాడ్యమి తె.3.45 వరకు (తెల్లవారితే ఆదివారం) తదుపరి విదియ, నక్షత్రం: పునర్వసు తె.4.56 వరకు (తెల్లవారితే ఆదివారం), తదుపరి పుష్యమి, వర్జ్యం: సా.4.38 నుండి 6.16 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.33 నుండి 7.17 వరకు, అమృతఘడియలు: రా.2.44 నుండి 3.46 వరకు; రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం : 5.34, సూర్యాస్తమయం : 6.33. 

మేషం...మిత్రులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. దైవదర్శనాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

వృషభం...కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మిథునం...ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. పనులు కొన్ని వాయిదా వేస్తారు.  శ్రమాధికం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.

కర్కాటకం....పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. పనులలో విజయం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి.

సింహం..వ్యయప్రయాసలు. పనులలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో  మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి..

కన్య......కొత్త పనులు చేపడతారు. ఇంటిలో శుభకార్యాలు. ధన, వస్తులాభాలు.  సంఘంలో గౌరవం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత..

తుల....నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహార విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం...రుణయత్నాలు. పనులలో ఆటంకాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు.

ధనుస్సు....రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. బంధువులతో వివాదాలు. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

మకరం...సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కుంభం..దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి.  ఇంటర్వ్యూలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మీనం....కుటుంబంలో చికాకులు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement