Telugu Horoscope: ఈ రాశివారి శ్రమ ఫలిస్తుంది | Daily Horoscope July 19-07-2024 | Sakshi
Sakshi News home page

Telugu Horoscope: ఈ రాశివారి శ్రమ ఫలిస్తుంది

Published Fri, Jul 19 2024 7:02 AM | Last Updated on Fri, Jul 19 2024 8:35 AM

Daily Horoscope July 19-07-2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: శు.త్రయోదశి సా.6.01 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: మూల రా.2.31 వరకు, తదుపరి çపూర్వాషాఢ, వర్జ్యం: ఉ.10.16 నుండి 11.54 వరకు, తదుపరి రా.12.53 నుండి 2.31 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.12 నుండి 9.04 వరకు, తదుపరి రా.10.59, నుండి 11.43 వరకు, అమృతఘడియలు: రా.8.01 నుండి 9.36 వరకు. 

మేషం: బంధువర్గం నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. విద్యార్థులకు నిరుత్సాహం. వృత్తి, వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

వృషభం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఖర్చులు పెరుగుతాయి. శ్రమాధిక్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగయత్నాలలో అవాంతరాలు.  పనులు వాయిదా. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు.

మిథునం: కొత్త మిత్రులు పరిచయం. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ధార్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

కర్కాటకం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖుల పరిచయం. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

సింహం: పనులలో స్వల్ప ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. అంచనాలలో పొరపాట్లు. ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

కన్య: శ్రమాధిక్యం. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరులతో కలహాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

తుల: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఉద్యోగలాభం. పరిచయాలు పెరుగుతాయి.  వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

వృశ్చికం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. కష్టానికి ఫలితం పొందుతారు. వాహనయోగం. భూవివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మకరం: పనుల్లో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహనయోగం. ఆలయ దర్శనాలు.. చర్చలు సఫలం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మీనం: శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగయత్నాలు సానుకూలం. కొన్ని బాకీలు వసూలవుతాయి. కీలక సమాచారం. విద్యార్థులకు శుభవర్తమానాలు. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహం.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement