Rasi Phalalu: ఈ రాశివారికి వస్తులాభం.. కొత్త విషయాలు తెలుసుకుంటారు | Sakshi
Sakshi News home page

దినఫలం: ఈ రాశివారికి వస్తులాభం, మిగతా 11 రాశులవారికి ఇలా..

Published Sat, Mar 23 2024 6:43 AM

Daily Horoscope Today Telugu Rasi Phalalu March 23 2024 - Sakshi

గ్రహఫలం..శనివారం, 23.03.24

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం,
తిథి: శు.త్రయోదశి ఉ.7.24 వరకు, తదుపరి చతుర్దశి,
నక్షత్రం: పుబ్బ పూర్తి (24 గంటలు),

సూర్యోదయం: 6.07, సూర్యాస్తమయం: 6.07. 

వర్జ్యం: ప.1.38 నుండి 3.22 వరకు,
దుర్ముహూర్తం: ఉ.6.04 నుండి 7.43 వరకు,
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు,
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు,

అమృతఘడియలు: రా.12.11 నుండి 2.04 వరకు;


మేషం: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగులకు పనిభారం.

వృషభం: కుటుంబంలో చికాకులు. అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మిథునం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కర్కాటకం: కుటుంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

సింహం: కొత్త విషయాలు తెలుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

కన్య: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

తుల: పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

వృశ్చికం: కొత్త పనులు ప్రారంభం. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

ధనుస్సు: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మకరం: ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కుంభం: ఉద్యోగయత్నాలు సానుకూలం. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం. ఆహ్వానాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

Advertisement
Advertisement