Rasi Phalalu: ఈ రాశివారు కొన్ని సమస్యలతో కుస్తీ పడతారు | Today Telugu Horoscope On March 24th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu - Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశివారు కొన్ని సమస్యలతో కుస్తీ పడతారు

Published Sun, Mar 24 2024 6:27 AM

Horoscope Today: Rasi Phalalu On March 24 2024 In Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: శు.త్రయోదశి ఉ.7.24 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: పుబ్బ పూర్తి (24 గంటలు), వర్జ్యం: ప.1.38 నుండి 3.22 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.04 నుండి 7.43 వరకు, అమృతఘడియలు: రా.12.11 నుండి 2.04 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 6.07, సూర్యాస్తమయం: 6.07. 

మేషం: కొన్ని సమస్యలతో కుస్తీ పడతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యగాలు చికాకు పరుస్తాయి.

వృషభం: సన్నిహితుల నుండి ఒత్తిడులు. దూరప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. ఉద్యోగయత్నాలు ఫలించవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మిథునం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులు మీకు చేదోడుగా నిలుస్తారు. మీ సత్తా చాటుకునే రోజు. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

కర్కాటకం: సన్నిహితులు, బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొన్ని సమస్యలతో సతమతమవుతారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

సింహం: ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. చిత్రమైన సంఘటనలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

కన్య: సన్నిహితుల నుండి ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలలో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

తుల: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రుల నుండి శుభవార్తలు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

వృశ్చికం: ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలబ్ధి. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

ధనుస్సు: మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మకరం: మీ అంచనాలు ఫలించవు. వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

కుంభం: ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఆత్మీయులతో సఖ్యత నెలకొంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనూహ్యంగా అభివృద్ధి చెందుతాయి.

మీనం: రుణభారం తొలగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సేవాకార్యక్రమాలు చేపడతారు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

Advertisement
Advertisement