No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, May 7 2024 11:25 AM

No Headline

బాపట్ల పార్లమెంటరీ అభ్యర్థ్ధి నందిగం సురేష్‌

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో జగనన్న జెండా రెపరెపలాడటం ఖాయమని బాపట్ల పార్లమెంటరీ అభ్యర్థి నందిగం సురేష్‌ అన్నారు. ప్రజలంతా ఏకమై జగనన్నకు అండగా నిలబడటంతో కూటమికి తిప్పలు తప్పవని తెలిపారు. 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలు డిపాజిట్‌లు కోల్పోయి చుక్కలు లెక్కపెట్టుకోవాల్సిందేనని విమర్శించారు. ప్రజా మద్దతుతో జగనన్న సింగిల్‌గా వస్తుంటే 40 సంవత్సరాలు అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడారని ధ్వజమెత్తారు. ఇటీవల చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో మోసపూరితమని విమర్శించారు. 2019 నుంచి 2024 వరకు జగనన్న అమలు చేసిన పథకాలను వ్యతిరేకించిన చంద్రబాబే నేడు వాటిని తన మేనిఫెస్టోలో పొందుపరిచి ప్రజలను మోసగించేందుకు సిద్ధపడ్డారన్నారు. పింఛన్‌ రూ.4వేలు అని ప్రకటించిన రెండు రోజుల్లోనే మేనిఫెస్టోలో దాన్ని లేకుండా చేశాడని గుర్తు చేశారు. 2019లో 151 ఎమ్మెల్యే సీట్లను బహుమతిగా అందించిన ప్రజలు ఈ సారి 175కు 175 అందించి అఖండ మెజార్టీతో వైఎస్సార్‌ సీపీని గెలిపించాలని సురేష్‌ కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement