ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
బాపట్ల: ప్రజల సమస్యలను పరిష్కరించడంపై అధికారులు అధిక ప్రాధాన్య ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు వినతి పత్రాల ద్వారా తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. తన పరిధిలోని వాటికి జిల్లా కలెక్టర్ సత్వరమే పరిష్కార మార్గం చూపుగా, కొన్నింటిని పరిశీలనకు, మరికొన్నిటిని విచారించాలని సంబంధిత అధికారులకు పంపారు. మిగిలినవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ, డీఆర్‌డీఏ, పోలీస్, మార్కెటింగ్, ఇరిగేషన్ తదితర శాఖలకు సంబంధించి 140 అర్జీలు నమోదయ్యాయి. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ చెప్పారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని, నిర్లిప్తంగా ఉండే చర్యలు తప్పవన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు, ఆర్డీఓ గ్లోరియా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 140 అర్జీలు
Comments
Please login to add a commentAdd a comment