వెంటాడిన మృత్యువు | - | Sakshi
Sakshi News home page

వెంటాడిన మృత్యువు

Published Wed, Nov 6 2024 2:24 AM | Last Updated on Wed, Nov 6 2024 2:24 AM

వెంటా

వెంటాడిన మృత్యువు

విధి ఆ కుటుంబంపై చిన్నచూపు చూసింది.. మృత్యువు వారిని వెంటాడి లోబరుచుకుంది. మామ గుండెపోటుతో చనిపోగా, ఆయన అంత్యక్రియలకని దూరప్రాంతం నుంచి వచ్చిన అల్లుడిని లారీ బలితీసుకుంది. దీంతో తల్లి, కూతుళ్లు ఒక్కరోజు తేడాలో తమ భర్తలను కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటనలతో కారంచేడులో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కారంచేడు/చినగంజాం: మృత్యువు ఆ కుటుంబాన్ని వెంటాడింది. గుండెపోటుతో మామ మృతిచెందిన ఒక్క రోజు వ్యవధిలోనే అల్లుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన బాపట్ల జిల్లా కారంచేడులో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. కారంచేడుకు చెందిన సీనియర్‌ నాయకుడు యార్లగడ్డ అక్కయ్య చౌదరి (66) ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. ఆయన కుమార్తె శేషుకుమారి భర్త ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు గ్రామానికి చెందిన మారెళ్ల సదాశివరావు (49) మంగళవారం తన స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనంపై కారంచేడు వెళుతుండగా చినగంజాం టోల్‌ప్లాజా దగ్గరకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ డ్రైవర్‌ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ బైక్‌ను ఢీకొట్టి వెళ్లిపోయాడు. రోడ్డుపై పడిపోయిన సదాశివరావు తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని మేనమామ జిల్లెలమూడి వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. టోల్‌ ప్లాజ్‌ వద్ద వేగంగా వెళుతున్న లారీ నంబరు, లారీ వివరాలు సీసీ కెమెరాలో నమోదు కావడంతో ఎస్‌ఐ శీలం రమేష్‌ వెంటనే స్పందించి హైవే పోలీసులకు సమాచారం అందించి ప్రమాదానికి కారణమైన లారీని డ్రైవర్‌ను అదుపులోనికి తీసుకున్నారు.

మామ అంత్యక్రియలకని వచ్చి..

తల్లీకూతుర్లు ఒక్క రోజు తేడాతో భర్తలను కోల్పోయారు. ఈ విషాద సంఘటనతో కారంచేడు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. హైదరాబాద్‌లో ఉండే సదాశివరావు కుటుంబం అక్కయ్యచౌదరి మరణ వార్తను విని ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కారంచేడు వచ్చారు. సోమవారం అంత్యక్రియలు ముగిశాయి. మంగళవారం సదాశివరావు నాగులుప్పలపాడు వెళ్లి తిరిగి కారంచేడుకు వచ్చే క్రమంలో రోడ్డు ప్రమాదానికి బలయ్యాడు. మృతునికి భార్య, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు.

ఆదివారం మామ.. మంగళవారం అల్లుడు మృతి కారంచేడులో విషాదం

No comments yet. Be the first to comment!
Add a comment
వెంటాడిన మృత్యువు 1
1/1

వెంటాడిన మృత్యువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement