వీఓఏల తొలగింపు సరికాదు
రేపల్లె రూరల్: వీఓఏల అక్రమ తొలగింపులను నిలుపుదల చేయాలని, లేనిపక్షంలో ప్రభుత్వం తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మణిలాల్ ధ్వజమెత్తారు. వీఓఏ యానిమేటర్‌ల అక్రమ తొలగింపులకు నిరసనగా పట్టణంలోని ఐకేపీ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్(వీఓఏ)లు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే మండలంలో ఎనిమిది మందిని నోటి మాట ద్వారా బలవంతంగా అక్రమ తొలగింపులు చేశారన్నారు. గ్రామైక్య సంఘాలు, గ్రూపుల అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్దంగా తొలగించటం అన్యాయమన్నారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేనిపక్షంలో కోర్టుల ద్వారా న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఏపీఎం గోపీకి వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ నాయకులు కె.గోపీ, కె.ఆశీర్వాదం, రేపల్లె మండలం ఐకేపీ వీఓఏ యానిమేటర్‌లు గడ్డం జయలక్ష్మి, రోజామణి, జయశ్రీ, విజయ, సుకన్య, నాగలక్ష్మి, స్వాతి, అనురాధ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment