‘పనివేళల పెంపు’ నిలుపుదల చేయాలి
ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బడుగు శ్రీనివాసరావు
బాపట్లటౌన్: పాఠశాలల పనివేళల పెంపు ప్రయోగం వెంటనే నిలుపుదల చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బడుగు శ్రీనివాసరావు తెలిపారు. పట్టణంలోని జిల్లా ఎస్టీయూ కార్యాలయంలో మంగళవారం ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బడుగు శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఉన్నత పాఠశాలు, హైస్కూల్ ప్లస్ పాఠశాలల పనివేళల్లో మార్పు చేస్తూ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించాలన్న నిర్ణయాన్ని సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికే పాఠశాలల్లో పలురకాల వర్క్‌షాపులు, ఆన్‌లైన్ పనుల వంటి బోధనేతర పనులు, రెసిడెన్షియల్ శిక్షణలతో ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, మొదటి దశగా బోధనకు ఆటంకం కలిగిస్తున్న యాప్‌లను ను రద్దుచేసి ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఏ రాష్ట్రం అమలు చేయని ఈ సరికొత్త పనివేళల మార్పు ప్రయోగం ఇక్కడ అమలు చేయడం సమంజసం కాదన్నారు. ఆర్థిక కార్యదర్శి బొంత వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ వాణి కన్వీనర్ పి.వి.నాగరాజు, అదనపు ప్రధాన కార్యదర్శి ఎన్‌బీ సుభాని, రాష్ట్ర కౌన్సిలర్ ఎ.ఉదయ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment