జనవరి 30న విజ్ఞాన్ ఫార్మసీలో అంతర్జాతీయ సదస్సు
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ ఫార్మసీ కళాశాలలో జనవరి 30వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస బాబు మంగళవారం తెలిపారు. అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన బ్రోచర్‌ను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసబాబు మాట్లాడుతూ ‘ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ పర్సనలైజ్డ్ డ్రగ్ డిస్కవరీస్– ఏ ఫ్యూచరిస్టిక్ అప్రోచ్’ అనే అంశంపై మూడు రోజుల పాటు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌ను ‘నెక్ట్స్‌జెన్ ఫార్మా కనెక్ట్–2025’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ మోంటుకుమార్ ఎం.పటేల్, గౌరవ అతిథులుగా ఏపీ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్, న్యూఢిల్లీలోని పీసీఐ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ఎస్.ఎల్.ఎన్ ప్రసాద్ రెడ్డి, న్యూఢిల్లీలోని పీసీఐ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ఎం.వెంకటరమణ, ఏపీ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.విల్లియం కారే హాజరవుతారని తెలిపారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్, సీఈఓ డాక్టర్ జగదీష్ బాబు రంగిశెట్టి, గౌరవ అతిథులుగా హైదరాబాద్ బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కో–ఫౌండర్ డాక్టర్ మానిక్ రెడ్డి పుల్లగుర్ల, హైదరాబాద్ జెనరా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ డాక్టర్ శ్రీనివాస్ ఆరుట్ల హాజరవుతారని తెలిపారు. చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్యతో పాటు ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస బాబు, డీన్లు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment