అమ్మవారికి బంగారం హారం బహూకరణ
వేటపాలెం: రామన్నపేట శివారు పంట పొలాల్లో ఉన్న కల్పవల్లి కనక నాగవరపమ్మ అమ్మవారికి ఓ భక్తుడు రూ.2,72,465 లక్షలు విలువ చేసే 37 గ్రాముల బంగారం హారాన్ని ఆదివారం బహూకరించారు. ముందుగా దాత కుటుంబ సభ్యులు ఆలయం ప్రాంగణంలో అమ్మవారికి పొంగళ్లు పొంగించి, మొక్కు తీర్చుకొన్నారు. ఈఓ పోతిన శ్రీనివాసరావు మాట్లాడుతూ జాండ్రపేటకు చెందిన సిరిపురపు నాగశివకుమార్, గీతాదేవి దంపతులు అమ్మవారిని తాము కోరిన కోర్కె తీరితే బంగారు హారం చేయిస్తామని మొక్కుకున్నారని తెలిపారు. కోరుకున్నది జరగడంతో మొక్కు లు చెల్లించి, హారం బహూకరించినట్లు చెప్పారు. ఆలయం తరఫున ఈఓ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
అద్దంకితో విడదీయలేని అనుబంధం
ప్రకాశం పంతులు మునిమనవరాలు
అద్దంకి రూరల్: అద్దంకితో తమ కుటుంబానికి ఉన్న బంధం విడదీయలేనిదని టంగుటూరి ప్రకాశం పంతులు ముని మనవరాలు సుభా షిణి అన్నారు. ఆదివారం కుటుంబసమేతంగా అద్దంకి వచ్చారు. స్థానిక బంగ్లా రోడ్డులోని ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన ముత్తాత ప్రకాశం పంతులుగారు ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి కావడం ఎంతో గర్వకారణమని తెలిపారు. తనకు ఏమీ ఉంచుకోకుండా దేశానికి అర్పించిన త్యాగధనుడని పేర్కొన్నారు. అద్దంకిలో ఆయన తిరిగిన ప్రదేశాలు, చదువు తదితర వివరాలు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో సుభాషిణి భర్త విజయశంకర్, సృజన అధ్యక్షుడు గాడేపల్లి దివాకరదత్తు, జ్యోతిష్మతి, లెవీ ప్రసాద్, షేక్ మహమ్మద్ రఫీ, నరసింహారావు పాల్గొన్నారు.
వాహన పన్నులను
వెంటనే చెల్లించాలి
బాపట్ల: సాంకేతిక సమస్యలు అధిగమించేందుకు గాను త్రైమాసిక వాహన పన్నును వారం రోజులు ముందుగానే చెల్లించాలని జిల్లా రవాణా శాఖ అధికారి టి.కె.పరంధామరెడ్డి సూచించారు.ఈ ఏడాది మార్చి క్వార్టర్‌కు సంబంధించి పన్నులను ఈ నెల 31లోపు (నేషనల్ సాఫ్ట్ వేర్) ద్వారా చెల్లించ వలసి ఉన్నందున ఈకేవైసీ, మండల్ మాపింగ్‌లను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. ఇతర రాష్ట్రాలలో వాహన కేసులు బకాయి ఉన్న పక్షంలో పన్ను చెల్లించడానికి వీలుకాదని, వాటిని వెంటనే క్లియర్ చేసుకోవాలని తెలిపారు. ఆఖరి రోజు వరకు వేచి ఉండకుండా సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు గాను వారం రోజులు ముందుగానే త్రైమాసిక పన్నును చెల్లించాలని వాహన యజమానులకు ఆయన సూచించారు.
బిడ్డ సహా
తల్లి ఆత్మహత్య
లక్ష్మీపురం: విజయవాడ – చైన్నె జాతీయ హైవే సమీపంలోని బుడంపాడు రైలు పట్టాలపై గుర్తు తెలియని మహిళ తన బిడ్డ సహా ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుడంపాడు వద్ద రైలు పట్టాలపై ఓ మహిళ, పసి బిడ్డ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం వచ్చింది. ఎస్సై లక్ష్మీనారాయణరెడ్డి సిబ్బందితో చేరుకున్నారు. వారి వివరాలు తెలియరాలేదు. మృతదేహాలను ప్రభుత్వ సమగ్రాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు గుంటూరు జీఆర్పీ ఎస్సైని 83280 18787, పోలీస్ స్టేషన్‌ను 0863–222073 ఫోను నంబర్లలో సంప్రదించాలని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment