తైక్వాండో పోటీల్లో 24 మందికి పతకాలు
తెనాలి అర్బన్: తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో తెనాలికి చెందిన కేఎస్‌ఆర్ తైక్వాండో అకాడమీకి చెందిన 23 మందికి పతకాలు లభించాయి. ఈ మేరకు కోచ్ కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు తెలిపారు. వీరిలో 10 మందికి బంగారు, తొమ్మిది మందికి వెండి, ఐదుగురికి కాంస్య పతకాలు లభించినట్లు చెప్పారు. పోటీలను బాపట్ల జిల్లా రేపల్లెలోని శ్రీవాసవీ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈ నెల 11, 12వ తేదీలలో నిర్వహించినట్లు తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు పతకాలను ఆదివారం అకాడమీలో అందజేసి, అభినందించారు. కార్యక్రమంలో వీరవల్లి మురళి, సర్పంచ్ కె.నాగభూషణం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ విధానాలను రద్దు చేయాలి
రౌండ్ టేబుల్ సమావేశంలోసీపీఎం జిల్లా కార్యదర్శి విజయకుమార్
నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాలను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం కోటప్పకొండ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఏపీ మోడల్ స్కూలులో పనిచేసే ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి ఏపీ మోడల్ స్కూల్ అటెండర్, వాచ్‌మెన్ ఔట్‌సోర్సింగ్ యూనియన్ గౌరవాధ్యక్షులు వినుకొండ పేరయ్య అధ్యక్షత వహించారు.విజయకుమార్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే మినిమమ్ టైమ్‌స్కేలు ఇచ్చి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అమలుచేయకుండా వదిలేయటాన్ని తీవ్రంగా ఖండించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి షేక్ సిలార్‌మసూద్ మాట్లాడుతూ మోడల్‌స్కూలులో పనిచేసే అటెండర్లు, వాచ్‌మెన్‌లకు స్వీపర్ పనులు తొలగించాలని, సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పౌరహక్కుల సంఘ సంయుక్త కార్యదర్శి శిఖినం చిన్న, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం(పీడీఎం) సీనియర్ నాయకులు నల్లపాటి రామారావు, పీకేఎస్ జిల్లా కార్యదర్శి కంబాల ఏడుకొండలు, రైతుసంఘ నాయకులు గోపాలరావు, యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment