40 క్వింటాళ్ల మినప గుళ్లు దగ్ధం
మార్టూరు: స్థానిక మార్టూరు జాతీయ రహదారిపై మినప గుళ్లు తరలిస్తున్న వాహనం షార్ట్ సర్క్యూట్‌కు గురై దగ్ధమైన సంఘటన శనివారం రాత్రి మండల పరిధిలోని డేగరమూడి సమీపంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. నెల్లూరు నుంచి చిలకలూరిపేటకు మినప గుళ్లు తరలిస్తున్న వాహనంలో డేగరమూడి, తాతపూడి గ్రామాల మధ్య ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి దిగిపోయాడు. సమాచారం అందుకున్న చిలుకలూరిపేట అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వాహనం డ్రైవర్ స్థానికుల సహాయంతో 20 బస్తాలను బయటకు తరలించగా 40 బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న మార్టూరు సీఐ శేషగిరిరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును డ్రైవర్ను అడిగి తెలుసుకుని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment