ప్రజా కవి యోగి వేమన
బాపట్ల: యోగి వేమన పద్యాలు పలకని తెలుగువారుండని జేసీ ప్రఖర్‌జైన్ పేర్కొన్నారు.వేమన జయంతి సందర్భంగా స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సంయుక్త కలెక్టర్ చాంబర్‌లో ఆదివారం ఆయన చిత్రపటానికి జేసీ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి డి.గంగాధర్ గౌడ్ పూలమాలవేసి జ్యోతి వెలిగించారు. జేసీ మాట్లాడుతూ యోగి వేమన భారతీయ తత్వవేత్త, కవి అన్నారు. ఆయన కవితలు సరళమైన భాష, స్థానిక యాసలను కలిగి ఉండటంతో తెలుగు దేశంలో ప్రసిద్ధి చెందాయని తెలిపారు. తెలుగువారు వేమన పద్యాలను వల్లేవేస్తూ ఉంటారన్నారు. యోగి వేమన జీవిత చరిత్రపై చలనచిత్రం కూడా నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి జి.వి.శివలీల, సిబ్బంది పాల్గొన్నారు.
పసుపు రైతులకు
పరిహారం చెల్లించాలి
తాడేపల్లి రూరల్ : దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్నిబాధిత పసుపు రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని ఏపీ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుగ్గిరాల గ్రామంలో ఆదివారం సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అగ్నిప్రమాదంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, పరిహారం చెల్లించాలని అనే క ఉద్యమాలు నిర్వహించినట్లు తెలియజేశారు. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం క్వింటాకు రూ.7 వేల నష్టపరిహారం ఇస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇవ్వకపోవడంతో బాధిత రై తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు. ఇప్పటికీ ప్రభుత్వం స్పందిచకపోతే ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
బహుమతి అందుకుంటున్న
బాలాజీ మోహన్‌కృష్ణ
బహుమతికి ఎంపికై న ఫొటో
వేటపాలెం: స్థానిక స్టార్ స్టూడియో నిర్వాహకుడు బాలాజీ మోహన్ కృష్ణకు అమరావతి అనే సబ్జెక్టుపై తీసిన ఫొటోకి ప్రత్యేక బహుమతి లభించింది. ఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ కౌన్సిల్, ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలో అమరావతిపై ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహించారు. ఇందులో బాలాజీ తీసిన ఫొటోకి బహుమతి లభించింది. శనివారం విజయవాడలోని బాలోత్సవ్ భవనంలో జరిగిన కార్యక్రమంలో బాలాజీ బహుమతి అందుకున్నాడు. అమరావతి ఫెస్టివల్ సొసైటీ చైర్మన్ కె. పట్టాభిరామయ్య, ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, జి. నారాయణరావు పాల్గొన్నారు.
జేసీ ప్రఖర్ జైన్
Comments
Please login to add a commentAdd a comment