నగదు సీజ్‌ | Sakshi
Sakshi News home page

నగదు సీజ్‌

Published Tue, May 7 2024 4:35 AM

నగదు

టేకులపల్లి: మండలంలోని కోయగూడెం గ్రామానికి చెందిన మల్లెబోయిన వీరబాబు సోమవారం ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.60 వేల నగదు తీసుకెళ్తుండగా సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ షేక్‌ సైదా రవూఫ్‌ తెలిపారు.

సీఎంపై పోలీసులకు ఫిర్యాదు

కొత్తగూడెంటౌన్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్‌ రెహమాన్‌కు, వన్‌టౌన్‌ సీఐ కరుణాకర్‌కు సోమవారం బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కేవీ రంగాకిరణ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజలను రెచ్చగొట్టె వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు గొడుగు శ్రీధర్‌ యాదవ్‌, ఆకుల నాగేశ్వరావుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మద్యం స్వాధీనం

అశ్వాపురం: ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో మండల పరిధి లోని చింతిర్యాల క్రాస్‌రోడ్డులో బెల్ట్‌షాప్‌లో సోమవా రం ప్రత్యేక బృందం అధికారులు తనిఖీలు చేపట్టా రు. రూ.18,200 విలువైన 112 బీర్లను అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అధికారులు డాక్టర్‌ రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

చెక్‌పోస్టుల్లో తనిఖీ

ఇల్లెందు : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో లలితాపురం వద్ద ఏర్పాటుచేసిన సర్వైలెన్స్‌ టీమ్‌ చెక్‌పోస్టును మహబూబాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల వ్యయ పరిశీలకులు, ఐఆర్‌ఎస్‌ అధికారి రామ్‌కుమార్‌ గోపాల్‌ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థుల వ్యయం వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్‌లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు.

రేషన్‌ బియ్యం స్వాధీనం

టేకులపల్లి: మండల కేంద్రంలోని సీసీ రోడ్డు బజారులో భూక్య లాలు నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన 8.70 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భూక్య లాలు, ఆమెడ నాగభూషణం లబ్ధిదారుల నుంచి రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి అధిక రేట్లకు విక్రయించేందుకు నిల్వ ఉంచగా, పట్టుకుని సివిల్‌సప్లయ్‌ అధికారులకు అప్పగించామని ఎస్‌ఐ షేక్‌ సైదా రవూఫ్‌ ఎస్‌ఐ తెలిపారు.

మట్టి లారీల పట్టివేత

బూర్గంపాడు: మండలంలోని నకిరిపేటకు సమీపంలో సీతారామ కెనాల్‌ మట్టిని అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను ఆదివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి రెండు మట్టి లారీలను, జేసీబీని పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వాహనాల యజమానులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

దాడి ఘటనలో కేసు నమోదు

ఇల్లెందు: దాడి ఘటనపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణానికి చెందిన పి.సంపత్‌కుమార్‌ తన స్నేహితుడితో కలిసి కొత్తగూడెం వెళ్లి తిరిగి వస్తుండగా, 9వ మైలు తండా వద్ద రెండు కార్లు స్వల్పంగా ఢీ కొన్నాయి. ఈ క్రమంలో జగదాంబా సెంటర్‌ వద్ద ముగ్గురు వ్యక్తులు కారును అటకాయించి దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సందీప్‌ తెలిపారు.

పాల్వంచలో...

పాల్వంచ: దాడి ఘటనలో సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలోని ప్రశాంత్‌ కాలనీలో ఎ.హిమబిందు బెల్ట్‌ షాపు నిర్వహిస్తోంది. బెల్ట్‌ షాపు వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొనడంతోపాటు పాత కక్షల నేపథ్యంలో లీలావతిపై దాడి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు హిమబిందు, ఆమె తల్లి నాగమణిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బి.రాము తెలిపారు.

బోగస్‌ పత్రాలతో భూ విక్రయంపై కేసు..

పాల్వంచ: బోగస్‌ పత్రాలతో తనకు భూమి విక్రయించినట్లు అందిన ఫిర్యాదుపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పాత పాల్వంచకు చెందిన బత్తుల రాజుకు తంబళ్ల వెంకట స్వామి అనే వ్యక్తి 15 కుంటల భూమి విక్రయించాడు. అయితే ఈ భూమిని తమదని మరో వ్యక్తి కోర్టుకు వెళ్లడంతో అతని అనుకూలంగా తీర్పువచ్చింది. దీంతో తనకు తప్పుడు పత్రాలతో భూమి అమ్మారని పోలీసులకు రాజు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బి.రాము తెలిపారు.

నగదు సీజ్‌
1/1

నగదు సీజ్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement