నిర్భయంగా ఓటు వేయండి | Sakshi
Sakshi News home page

నిర్భయంగా ఓటు వేయండి

Published Tue, May 7 2024 4:45 AM

నిర్భయంగా ఓటు వేయండి

ఇల్లెందు: ఈనెల 13న జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కేంద్ర ఎన్నికల పరిశీలకులు చరణ్‌జిత్‌ సింగ్‌ కోరారు. సోమవారం ఇల్లెందు పట్టణంలోని పోలింగ్‌స్టేషన్లను, స్ట్రాంగ్‌ రూంలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. అనంతరం పోలీసులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రభాను, సీఐ కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్‌ బూత్‌ల పరిశీలన..

పట్టణంలోని పలు పోలింగ్‌ బూత్‌లను మహబూబాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల పరిశీలకులు రుచిత్‌ రాజ్‌ పరిశీలించారు. బూత్‌ల వద్ద అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు అన్ని పార్టీల వారు సహకరించాలని కోరారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినా, ఓటుకు నోటు అందజేసినా నేరంగా భావించాల్సి ఉంటుందని తెలిపారు. డబ్బు, మద్యం, ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు తమ ఓటను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రవాణా చెక్‌ పోస్టులను విస్తృతంగా తనిఖీ చేయాలన్నారు. ఆయన వెంట ఏఆర్‌ఓ కాశయ్య తదితరులు ఉన్నారు.

ప్రజలకు ఎన్నికల పరిశీలకుల సూచన

Advertisement

తప్పక చదవండి

Advertisement