రాష్ట్ర ఫుట్‌బాల్‌ జట్టుకు నేటి నుంచి శిక్షణ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ఫుట్‌బాల్‌ జట్టుకు నేటి నుంచి శిక్షణ

Published Thu, Nov 21 2024 12:37 AM | Last Updated on Thu, Nov 21 2024 12:37 AM

రాష్ట

రాష్ట్ర ఫుట్‌బాల్‌ జట్టుకు నేటి నుంచి శిక్షణ

కొత్తగూడెంఅర్బన్‌: జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అండర్‌– 17 బాలుర రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరచిన క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేసిన విషయం విదితమే. ఎంపికై న రాష్ట్ర జట్టు సభ్యులు ఈనెల 30 నుంచి డిసెంబర్‌ 6వ తేదీ వరకు జమ్మూ కశ్మీర్‌లో జరుగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ జట్టులో వివిధ జిల్లాల క్రీడాకారులు ఉండగా.. జట్టు సమన్వయం కోసం గురువారం నుంచి ఐదు రోజుల పాటు స్థానిక ప్రగతి మైదానంలో శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరాచారి, జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ నిర్వాహక కార్యదర్శి వాసిరెడ్డి నరేష్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో క్రీడాకారులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. గౌతంపూర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాల పీడీ బట్టు ప్రేమ్‌కుమార్‌ నేతృత్వంలో శిక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు.

పొదుపుతోనే

జీవితంలో మలుపు

లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రాంరెడ్డి

అశ్వారావుపేటరూరల్‌: చిన్న పొదుపుతోనే ప్రతి ఒక్కరి జీవితాల్లో మలుపు సాధ్యమని జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ వి.రాంరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక వ్యవసాయ కళాశాలలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించగా, ఆయన హాజరై మాట్లాడారు. ప్రతీ ఒక్కరి జీవితంలో ఆర్థిక యాజమాన్యం ఎంతో అవసరమని అన్నారు. ఆర్థిక లావాదేవీలు, సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ఆర్థిక నిపుణులు కె.వి.బాబూరావు మాట్లాడుతూ.. ఆర్థిక అక్షరాస్యత ప్రాముఖ్యత, ఆర్థిక వ్యవహారాల్లో లోటుపాట్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, అవకాశాల గురించి వివరించారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ హేమంత్‌కుమార్‌, ప్రొఫెసర్లు డాక్టర్‌ టి.శ్రావణ్‌కుమార్‌, డాక్టర్‌ కె.శిరీష, డాక్టర్‌ ఐ. కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఒలింపిక్‌

అసోసియేషన్‌ ఎన్నిక

పాల్వంచ: జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ కార్యవర్గాన్ని పాల్వంచలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి పరంధామరెడ్డి సమక్షంలో బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డాక్టర్‌ జి.యుగంధర్‌ రెడ్డి, కార్యదర్శిగా రాజేంద్రప్రసాద్‌ ఎన్నికయ్యారు. కోశాధికారిగా ఎస్‌కె.హుస్సేన్‌, ఉపాధ్యక్షులుగా వై.వెంకటేశ్వర్లు, బి.ఎం.ప్రేమ్‌కుమార్‌, మొగిలి, నాగేంద్ర త్రివేదిని ఎన్నుకున్నారు. అనంతరం పరంధామ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో క్రీడలను మరింతగా ప్రోత్సహించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అంతర్జాతీయ క్రీడాకారిణి సింధు తపస్వి, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు అనుదీప్‌, కె.మహిధర్‌, భూపేష్‌, రమేష్‌, బీహెచ్‌ రావు, కబీర్‌దాస్‌, రామిరెడ్డి, భాస్కర్‌, సతీష్‌, డానియేల్‌, రాంబాబు పాల్గొన్నారు.

నేడు, రేపు మాజీ మంత్రి హరీశ్‌రావు పర్యటన

ఖమ్మంమయూరిసెంటర్‌: మాజీ మంత్రి హరీశ్‌రావు గురు, శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఒక ప్రకటనలో తెలిపారు. లగచర్ల గిరిజనులకు సంఘీభావంగా గురువారం సాయంత్రం ఖమ్మం పెవిలియన్‌ గ్రౌండ్‌ నుండి జెడ్పీ సెంటర్‌లోని అంబేద్కర్‌ సెంటర్‌ వరకు సాగే ర్యాలీలో హరీశ్‌రావు పాల్గొంటారని వెల్లడించారు. అలాగే, శుక్రవారం ఉదయం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పత్తి, మిర్చి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసకుంటారని చెప్పారు. ఆతర్వాత బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడతారని తెలిపారు. మధ్యాహ్నం చింతకాని మండలం ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు బోజడ్ల ప్రభాకర్‌ కుటుంబంతో పాటు ఇటీవల జైలుకు వెళ్లొచ్చిన బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యను పరామర్శించడమే కాక చింతకాని మండలం లచ్చగూడెంలో విద్యుత్‌ శాఖ నిర్లక్షంతో మృతి చెందిన రైతు గూని ప్రసాద్‌ కుటుంబాన్ని పరామర్శిస్తారని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రాష్ట్ర ఫుట్‌బాల్‌ జట్టుకు నేటి నుంచి శిక్షణ1
1/1

రాష్ట్ర ఫుట్‌బాల్‌ జట్టుకు నేటి నుంచి శిక్షణ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement