‘సోలార్’పై విద్యార్థులకు అవగాహన
మణుగూరు టౌన్: సింగరేణి పాఠశాల విద్యార్థులకు సౌర్ విద్యుత్, ఉపయోగాలపై అవగాహన కల్పించారు. సింగరేణి ఎడ్యుకేషన్ జీఎం శ్రీనివాస్ గురువారం మణుగూరులో పర్యటించారు. పాఠశాల 9వ తరగతి విద్యార్థులతో కలిసి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సోలార్ పవర్ ప్లాంట్‌ను సందర్శించారు. సోలార్ పవర్‌తో సింగరేణి తీసుకుంటున్న పొదుపు చర్యలను, కలుగుతున్న ఆర్థిక ప్రయోజనాలను వివరించారు. సౌరశక్తి ఎంత వినియోగించుకున్నా తరగిపోని శక్తి వనరు అని చెప్పారు. విద్యార్థులు చదువుతోపాటు సృజనాత్మకతను పెంచుకోవాలని సూచించారు. తొలుత శ్రీనివాస్‌ను ఏరియా జీఎం కార్యాలయంలో జీఎం దుర్గం రాంచందర్, అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధికారులు సింగు శ్రీనివాస్, కల్యాణి, ఫిరోజ్, కృష్ణబాబు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment