రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన వేడుక వైభవంగా జరిగింది. తెల్లవారుజామున అంతరాలయంలో మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన స్వామి వారిని పల్లకీ సేవగా బేడా మండపంలో కొలువుదీర్చారు. అక్కడ అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణఽ దారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ తంతును కనులపండువగా జరిపించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ద్విభాషా
పాఠ్యపుస్తకాలపై సర్వే
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని బాబూ క్యాంపు ప్రభుత్వ పాఠశాలలో శనివారం ద్విభాషా పాఠ్య పుస్తకాలపై సర్వే నిర్వహించారు. సర్వే నిర్వాహకులు, డైట్ కళాశాల లెక్చరర్ బాలమురళి మాట్లాడుతూ అభిప్రాయాలను సేకరించి, క్రోఢీకరించి నివేదికను హైదరాబాద్‌లోని రాష్ట్ర విద్యా శిక్షణ సంస్థకు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.నీరజ, ఉపాధ్యాయులు షేక్ దస్తగిరి, చందర్‌రావు, భీమా, సునందిని, రమాదేవి, సరోజిని, సౌందర్య, ఉషారాణి, పుష్పారాణి, రాజేశ్వరి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment