అడవే వారికి ఉపాధి..
అనాదిగా ఆదివాసులకు అటవీ సంపద వరం లాంటిది. అటవీ ఉత్పత్తుల సేకరణలో ఆటుపోట్లను ఎదుర్కొని ఆదాయాన్ని సమకూర్చుకోవటం ఆనవాయితీ. ఏటా పోడు వ్యవసాయం పెరిగి అడవులు తరిగిపోతుండడంతో వాటిపై ఆధారపడిన వారు భారీగా ఆదాయాన్ని కోల్పొతున్నారు. ఆదివాసీలు సేకరించే అటవీ ఉత్పత్తులకు మెరుగైన ధర అందించి దళారుల బెడద లేకుండా గిరిజన సహకార సంస్థ(జీసీసీ) కొనుగోలు చేస్తోందని అధికారులు ప్రకటించారు. అటవీ ఉత్పత్తులపై ఆధారపడిన గిరిజనులకు ఆదాయం చేకూర్చడం కోసం జీసీసీ డీఆర్ డిపోలలో కొనుగోలు చేపట్టిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment