విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించాలి
భద్రాచలంటౌన్: పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పరీక్షించాలని డీఈఓ ఎం.వెంకటేశ్వరా చారి అన్నారు. స్థానిక విద్యా వనరుల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకుని చదివించాలన్నా రు. ప్రతీ రోజు బయోమెట్రిక్ హాజరు నమోదు చేసి లిస్ట్‌ను తమ కార్యాలయానికి పంపించాలని సూచించారు. 100 శాతం ఫలితాలు సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ప్లానింగ్ కో–ఆర్డినేటర్ ఎన్.సతీష్ పాల్గొన్నారు.
టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ఫీజు
షెడ్యూల్ విడుదల..
కొత్తగూడెంఅర్బన్: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సులైన డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీలో లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు వచ్చే జనవరిలో జరుగుతాయని, హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని, ఫీజు చెల్లించాలని డీఈఓ వెంకటేశ్వరాచారి శనివారం ఒక ప్రకటనలో సూచించారు. వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని, ఆ డాక్యూమెంట్‌ను తమ కార్యాలయంలో సమర్పించాలని, ఎలాంటి అపరాధ రుసుము లేకుండా డిసెంబర్ 3 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. డ్రాయింగ్ లోయర్ పరీక్షకు రూ.100, హయ్యర్ పరీక్షకు రూ.150, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ పరీక్షకు రూ.150, హయ్యర్ పరీక్షకు రూ.200 చొప్పున ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. రూ.50 అపరాధ రుసుముతో డిసెంబర్ 10వ తేదీ లోగా, రూ.75 అపరాధ రుసుముతో 17వ తేదీ లోగా ఫీజులు చెల్లించవచ్చని తెలిపారు. వివరాలకు 99890 27943 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
డీఈఓ వెంకటేశ్వరా చారి
Comments
Please login to add a commentAdd a comment