సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని దక్షిణ భారతదేశ ఏటీఏఆర్‌ఐ – జోన్ 10 డైరెక్టర్ డాక్టర్ షేక్ మీరా పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయం – అనుసరించాల్సిన పద్ధతులపై కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. పంటల సాగులో ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గించాలని అన్నారు. గో మూత్రం, జీవామృతం, బీజామృతం, వేపనూనె వంటివి వినియోగించాలన్నారు. కేవీకే శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను పాటించాలని, వారి సేవలు సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ జమునారాణి మాట్లాడుతూ రైతులు రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించి, ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని అన్నారు. కార్యక్రమంలో సహాయ విస్తరణ సంచాలకులు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి, కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ వి లక్ష్మీనారాయణమ్మ, శాస్త్రవేత్తలు డాక్టర్ నవీన్‌కుమార్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ బి శివ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment